Watch Video: డబ్బాలో ఇరుక్కుపోయిన కుక్క తల.. తిసేందుకు ప్రయత్నించిన వ్యక్తి.. చివరకు

మనుషులు చేసే తప్పులు, పొరపాట్లూ.. ప్రాణికోటికి శాపంగా మారుతున్నాయి.. మూగజీవాలు ఆహారం కోసం వెతుకుతూ.. వాటికీ తెలియకుండానే దేనిని పడితే వాటిని తినేస్తున్నాయి. ఇలా మనుషులు వాడి పడేసిన కాళీ డబ్బాల్లో ఆహారం దొరుకుతుందని ఆశతో కుక్కలు ఆ ప్లాస్టిక్ డబ్బాలలో తల పెట్టి ఆహారం తినడానికి ప్రయత్నం చేస్తాయి. ఆలా డబ్బాలో తల దూర్చిన ఓ శూనకంకు.. ఊహించని పరిణామం ఎదురైంది. ఒక్కసారిగా అందులో తల ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించింది.

Watch Video: డబ్బాలో ఇరుక్కుపోయిన కుక్క తల.. తిసేందుకు ప్రయత్నించిన వ్యక్తి.. చివరకు
Viral Video

Edited By: Subhash Goud

Updated on: Nov 16, 2025 | 4:52 PM

సాధారణంగా రోడ్డుపై తిరిగే కుక్కలకు ఏవైనా ఆహారం డబ్బాలు కనిపిస్తే.. వెంటనే వాటి దగ్గరకు వెళ్లి వాసల చూసి.. వాటిలో ఉన్న పదార్థాలను తినడం అలవాలు.. ఇలానే ఒక డబ్బాలో ఉన్న ఆహారాన్ని తినేందుకు వెళ్లిన ఒక శునకానికి ఊహించని పరిణామం ఎదురైంది. అది డబ్బలో తన పెట్టగానే.. అందులో తల ఇరుక్కుపోయింది. ఈ ఘటన కర్నూలు జిల్లా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఎమ్మిగనూరులో ఓ వీధి కుక్క ఖాళీగా ఉన్న ప్లాస్టిక్ డబ్బాలో ఏదో తిందామని తల పెట్టింది. అయితే అనుకోకుండా కుక్క తల ఆ డబ్బాలో ఇరుక్కుపోయింది. దీంతో కుక్క కంగారుపడి ఇరుక్కున్న డబ్బాలో నుంచి తలను వదిలించుకోవాలని ఊరు మొత్తం పరుగులు తీసింది. ఆ కుక్కకు సాయం చేయాలని చూసిన కాలనీ వాసులను చూసి అది మరింత భయపడింది.

ఇక చివరికకు ఎలాగోలా శునకాన్ని పట్టుకున్న స్థానికులు ఎంతో చాకచక్యంగా డబ్బా లో ఇరుక్కున్న కుక్క తలను బయటకు తీశారు. ఇక కుక్క ఊపిరి పీల్చుకుని బ్రతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుంచి ఉడాయించింది. అయితే అక్కడే ఉన్న కొందరు స్థానికులు ఇందుకు సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి.

ఈ వైరల్‌ వీడియోను చూసి జనాలు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఇలా చెత్త, వెస్ట్ డబ్బాలు వేయడంతో ఇలా మూగజీవలు ఇబ్బందులు పడుతున్నాయని, ఇప్పటికైనా ప్రజలు బాధ్యతగా ఉంటూ చెత్త సేకరణ వాహనాల్లో కానీ పట్టణ పారిశుద్ధ్య కార్మికులకు గాని చెత్తను వేయాలని కోరారు.

వైరల్ వీడియో..

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి