సీఎం కేసీఆర్‌ను కించపరుస్తూ స్కిట్‌.. రాణి రుద్రమ, దరువు ఎల్లన అరెస్ట్.. బండి సంజయ్‌కి నోటీసులు

బీజేపీ ఆధ్వర్యంలో నాగోల్‌ బండ్లగూడలో ఏర్పాటు చేసిన అమరుల యాది సభలో సీఎం కేసీఆర్‌తో పాటు ప్రభుత్వ పథకాలను కించపరిచే విధంగా స్కిట్‌ వేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

సీఎం కేసీఆర్‌ను కించపరుస్తూ స్కిట్‌.. రాణి రుద్రమ, దరువు ఎల్లన అరెస్ట్.. బండి సంజయ్‌కి నోటీసులు
Bandi Sanjay

Updated on: Jun 14, 2022 | 3:01 PM

Hayathnagar police: తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కించపరిచేలా నాటకం ప్రదర్శించారన్న అభియోగాలపై బీజేపీ నాయకులు రాణి రుద్రమ, దరువు ఎల్లన్నను హయత్‌నగర్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో నాగోల్‌ బండ్లగూడలో ఏర్పాటు చేసిన అమరుల యాది సభలో సీఎం కేసీఆర్‌తో పాటు ప్రభుత్వ పథకాలను కించపరిచే విధంగా స్కిట్‌ వేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాణి రుద్రమ, దరువు ఏల్లన్నని ఈ రోజు హయత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా.. ఈ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ (Bandi Sanjay) కి కూడా 41A CRPC కింద నోటీసులు జారీ చేసినట్లు హయత్‌నగర్‌ పోలీసులు తెలిపారు.

ఇదే విషయంలో గత నాలుగు రోజుల క్రితం అర్థరాత్రి జిట్టా బాలకృష్ణను పోలీసులు అరెస్ట్ చేయగా.. అదే రోజు బేయిల్‌పై విడుదల అయ్యారు. సీఎం కేసీఆర్‌ను, ప్రభుత్వాన్ని కించపరిచేలా స్కిట్‌ చేశారని ఆరోపణలు రావడంతోపాటు ఫిర్యాదు అందడంతో పోలీసులు ఈ చర్యలు తీసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..