Minister Harish Rao – Anganwadi teacher: 7 ఏళ్ళల్లో 3 సార్లు వేతనాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని మంత్రి హరీశ్ రావు అన్నారు. పోరాటాలు చేయకుండా గత ప్రభుత్వాలు జీతాలు పెంచిన దాఖలాలు లేవని చెప్పిన హరీశ్.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సీఎం వేతనాలు పెంచారని పేర్కొన్నారు. అందరూ వద్దన్నా కూడా వేతనాలు పెంచిన కేసీఆర్‌ని మీరందరూ గుర్తుంచుకోవాలని ఆయన అంగన్ వాడీ టీచర్లను కోరారు. కరీంనగర్లో అంగన్ వాడీ టీచర్లను ఉద్దేశించి హరీశ్ రావు ఇవాళ మాట్లాడారు. PRC ని పెంచినందుకు కృతజ్ఞత సభ చేపడుతామని అంగన్ వాడీ టీచర్లు కోరిన విషయాన్ని ఈ సందర్భంగా హరీశ్ రావు గుర్తుచేసుకున్నారు.
“తెలంగాణ బీజేపీ నేతలు అంతా కేంద్రం డబ్బే అంటున్నారు.. గ్యాస్ ధరలో GST 5 శాతం మాత్రమే. రాష్ట్రం పన్నులు లేవు. పిల్లలు పెరుగుతున్న కొద్దీ బడ్జెట్ పెరగాలి కానీ కేంద్రం తగ్గిస్తోంది. కానీ తెలంగాణ పెంచింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను కేంద్రం విపరీతంగా పెంచింది అని హరీశ్ వ్యాఖ్యానించారు.” అని హరీశ్ రావు తెలిపారు. అంగన్ వాడీ టీచర్లకు ప్రమోషన్స్ వచ్చేలా మంత్రి సత్యవతి రాథోడ్‌తో మాట్లాడుతానని.. దీనికి సంబంధించి ఉత్తర్వులు ఇప్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
రాబోయే రోజుల్లో మొదటి వారంలోనే వేతనాలు విడుదల చేస్తామని హరీశ్ మాటిచ్చారు. ఈ ప్రభుత్వానికి మీరు కూడా ఆశీర్వాదం ఇవ్వాలని హరీశ్ రావు టీచర్లను కోరారు. అంగన్ వాడీ స్కూల్స్‌ని ఉపాధ్యాయ వ్యవస్థతో కలపాలన్నది సీఎం ఆలోచన అని చెప్పిన హరీశ్ రావు.. దీనికి సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారని చెప్పారు.
Read also: వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారికి బంపరాఫర్.. కట్ చేస్తే.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!