Telangana: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణలో నవంబర్‌ 6 నుంచి ఒంటి పూట బడులు!

|

Nov 05, 2024 | 4:05 PM

Telangana: విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ తెలిపింది. నవంబర్‌ 6 నుంచి ఒంటి పూట బడులను నిర్వహించనుంది. అదేంటి.. ఒంటిపూట బడులు వేసవి సెలవుల ముందుగా అని అనుకుంటున్నారా? అందుకు కారణం ఉందండోయ్‌..

Telangana: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణలో నవంబర్‌ 6 నుంచి ఒంటి పూట బడులు!
Follow us on

నవంబర్‌ 6వ తేదీ నుంచి అంటే బుధవారం తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే ప్రారంభం కానుంది. ఈ సర్వేలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఇతర అధికారులు పాల్గొననున్నారు. ఇప్పటికే సర్వేకు సంబంధించిన జాబితాను అధికారులకు అందించింది ప్రభుత్వం. రేపటి నుంచి ఇంటికి వెళ్లి కుల గణన సర్వే చేయనున్నారు.

ఇందుకోసం ఉపాధ్యాయులను వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించగా, 36,559 మంది ఎస్​జీటీల సేవలను, 3,414 మంది ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపల్స్, 6,256 మంది ఎంఆర్​సీలు, 2000 మంది ప్రభుత్వ మినీస్టీరల్ స్టాఫ్ సహా వివిధ విభాగాల్లో పని చేస్తున్న నాన్ టీచింగ్ స్టాఫ్​తో కలిపి పాఠశాల విద్యా శాఖ నుంచి మొత్తం 50 వేల మంది సిబ్బందిని కుల గణనకు వినియోగించనున్నారు.

ఈ సర్వే నేపథ్యంలో ప్రభుత్వం విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. నవంబర్‌ 6 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ ఒంటిపూట బడులు అన్ని తరగతుల వారికి కాదు, కొందరికి మాత్రమే వర్తించనుంది. రాష్ట్రంలో కుల గణన సందర్భంగా సర్వేలో మధ్యాహ్నం వరకు బడులు నడిపి తర్వాత ఉపాధ్యాయులు కులగణనలో పాల్గొననున్నారు. అయితే ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని సెకండరీ గ్రేడ్ టీచర్​లకు మినహాయింపు ఇస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు ఉపాధ్యాయులు స్కూళ్లలో పని చేసి ఆ తర్వాత కులగణనలో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

నేపథ్యంలో ప్రైమరీ స్కూల్స్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే పని చేయనున్నట్టు పాఠశాల విద్యా శాఖ ప్రకటించింది. సర్వే పూర్తి అయ్యేవరకు ఇది అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.

75 ప్రశ్నలతో సర్వే :

ఈ కుటంబ సమగ్ర సర్వేలో మొత్తం 75 ప్రశ్నలు ఉంటాయి. వీటి నుంచి అధికారులు పూర్తి సమాచారం సేకరిస్తారు. అధికారులు అడిగిన వివరాలు కుటుంబ పెద్ద చెప్పాల్సి ఉంటుంది. సాధారణ, విద్య, ఉద్యోగ, ఉపాధి, భూములు, రిజర్వేషన్ ప్రయోజనాలు, వలసలు, రాజకీయ సమాచారం అడనున్నారు. ఈ సర్వే ఈనెల 30 వరకు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

హైదరాబాద్‌లో తులం ఎంతంటే..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి