Telangana Assembly: త్వరలోనే డీఎస్సీ నోటీఫికేషన్, ఉద్యోగాల భర్తీ.. అసెంబ్లీలో గవర్నర్ కీలక ప్రసంగం..

|

Dec 15, 2023 | 12:48 PM

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నిన్న స్పీకర్‎గా గడ్డం ప్రసాద్ బాధ్యతలు చేపట్టిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈరోజు ఉదయం 11 గంటలకు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ అసెంబ్లీకి హాజరైన తమిళసై తన ప్రసంగంలో ముందుగా కాళోజీ కవితతో తన ప్రసంగాన్ని ప్రారంభించి కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి స్పీకర్‌, శాసన మండలి చైర్మన్‌ హాజరయ్యారు.

Telangana Assembly: త్వరలోనే డీఎస్సీ నోటీఫికేషన్, ఉద్యోగాల భర్తీ.. అసెంబ్లీలో గవర్నర్ కీలక ప్రసంగం..
Telangana Assembly
Follow us on

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నిన్న స్పీకర్‎గా గడ్డం ప్రసాద్ బాధ్యతలు చేపట్టిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈరోజు ఉదయం 11 గంటలకు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ అసెంబ్లీకి హాజరైన తమిళసై తన ప్రసంగంలో ముందుగా కాళోజీ కవితతో తన ప్రసంగాన్ని ప్రారంభించి కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి స్పీకర్‌, శాసన మండలి చైర్మన్‌ హాజరయ్యారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతులను సభలోని సభ్యులకు చదివి వినిపించారు. త్వరలోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. వైద్య ఖర్చులు పెరగడంతో ఆరోగ్యశ్రీని రూ.10 లక్షలకు పెంచామన్నారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అని, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై విచారణ జరిపిస్తాం అని తన ప్రసంగంలో చదివి వినిపించారు. తొమ్మిదేళ్లలో ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారు.. వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచుతాం అన్న కాంగ్రెస్ ప్రభుత్వ ఎజెండాను అమె చెప్పుకొచ్చారు. దివాళా తీసిన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే మా లక్ష్యం అని, ఇది మా ప్రభుత్వం అనేటువంటి భావన ప్రజల్లో కలుగుతోందని తెలిపారు. ప్రజా దర్భార్‌లో ప్రజాసమస్యలు పరిష్కారం అవుతున్నాయన్నారు.

యూపీఏ ప్రభుత్వమే తెలంగాణను ఏర్పాటు చేసింది అని సభలోని తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెబుతూనే లక్ష్యాలను సాధించేందుకు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం అనే ప్రభుత్వం మాటను చదివి వినిపించారు. ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లో పూర్తి చేస్తాం.. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం అని కాంగ్రెస్ పేర్కొన్న అంశాలను గురించి వివరించారు. త్వరలో శాఖల వారీగా శ్వేత పత్రాన్ని విడుదల చేస్తాం అని తన ప్రసంగంలో పేర్కొన్నారు. అమరవీరుల కుటుంబాలకు 250 గజాల ఇంటిస్థలం.. గౌరవభృతి ఇస్తామని.. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ ఇచ్చేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కీలక అంశాలను చదివి వినిపించారు. చివరిగా దాశరథి సూక్తులతో తన ప్రసంగాన్ని ముగించారు.

ఇవి కూడా చదవండి

పూర్తి వీడియో..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..