AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Swiggy: భళారే భళా.! బిర్యానీల్లో హైదరాబాద్ జోష్.. ఒక్కడే ఏకంగా 1,633 ఆర్డర్లు..

భారత దేశంలో ఎక్కడా లేని విధంగా రుచికరమైన బిర్యానిని అందించే నగరంగా హైదరాబాద్ కు మంచి పేరుంది. ప్రస్తుతం డిజిటల్ యుగంలో ఆఫ్లైన్ కంటే కూడా ఆన్లైన్లో ఎక్కువ మంది బిర్యానీని అర్డర్ చేస్తున్నట్లు తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అందులో స్విగ్గీ ద్వారా కొన్ని లక్షల బిర్యానీలు డెలివరీ అయినట్లు ఈ సర్వేలో తేలింది. స్విగ్గీ 2023లో విడుదల చేసిన ట్రెండ్స్ ప్రకారం ఎనిమిదో సారి హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ ఫుడ్ గా మొదటి స్థానంలో నిలిచింది.

Swiggy: భళారే భళా.! బిర్యానీల్లో హైదరాబాద్ జోష్.. ఒక్కడే ఏకంగా 1,633 ఆర్డర్లు..
Hyderabad Biryani
Srikar T
|

Updated on: Dec 15, 2023 | 1:45 PM

Share

భారత దేశంలో ఎక్కడా లేని విధంగా రుచికరమైన బిర్యానిని అందించే నగరంగా హైదరాబాద్ కు మంచి పేరుంది. ప్రస్తుతం డిజిటల్ యుగంలో ఆఫ్లైన్ కంటే కూడా ఆన్లైన్లో ఎక్కువ మంది బిర్యానీని అర్డర్ చేస్తున్నట్లు తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అందులో స్విగ్గీ ద్వారా కొన్ని లక్షల బిర్యానీలు డెలివరీ అయినట్లు ఈ సర్వేలో తేలింది. స్విగ్గీ 2023లో విడుదల చేసిన ట్రెండ్స్ ప్రకారం ఎనిమిదో సారి హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ ఫుడ్ గా మొదటి స్థానంలో నిలిచింది. ఫుడ్ డెలివరీ యాప్‌లో 40,30,827 సార్లు సెర్చ్ చేయబడిన డిష్ గా రికార్డుకెక్కింది. 2023లో స్విగ్గీ డెలివరీ చేసే ప్రతి ఆరో ఆర్డర్లో బిర్యానీ ఉందని తెలిసింది. అందులోనూ ఎక్కువ మంది హైదరాబాద్ నుంచి ఆర్డర్ చేసినట్లు ఆ ప్రకటన తెలిపింది.

ఈ ఏడాదిలో మొదటి ఆరు నెలల్లోనే 72 లక్షలకు పైగా బిర్యానీలను హైదరాబాద్ వాసులు ఆర్డర్ చేసినట్లు స్విగ్గీ సంస్థ తాజాగా వెల్లడించింది. ఒక వ్యక్తి ఏడాదికి సరిపడ బిర్యానీలను ఒకే సారి ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపింది. ఇతను సంవత్సరాని 1,633 బిర్యానీలను ఆర్డర్ చేసినట్లు తెలుస్తోంది. అంటే రోజుకు నాలుగు లేదా ఐదు బిర్యానీలు కేవలం ఒకే వ్యక్తి కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్విగ్గి యాప్ ద్వారా ఆన్లైన్ లో ఫుడ్ డెలివరీ చేసుకునేందుకు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు ప్రజలు. ఇందులో భాగంగానే చెన్నై, హైదరాబాద్ వాసులు 10వేల కంటే ఎక్కువ ఆర్డర్లు ఇచ్చారు. ముంబాయిలో ఒక వ్యక్తి రూ. 42.3 లక్షల విలువైన ఆర్డర్లు చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఏడాది పొడవునా హైదరాబాద్ చికెన్ బిర్యానీకి మంచి డిమాండ్ ఉన్నట్లు స్విగ్గీ తెలిపింది. సెకనుకు 2.5 మంది స్విగ్గి యాప్ ద్వారా బిర్యానీ ఆర్డర్ చేస్తున్నట్లు తెలిసింది.

గతంలో హైదరాబాద్ కు చెందిన ఒకరు రూ. 6 లక్షల విలువైన ఇడ్లీలను ఆర్డర్ చేసి వార్తల్లోకెక్కారు. అంతేకాకుండా ప్రత్యేక డిస్కౌంట్లు, ఆఫర్లు, కూపన్ల ద్వారా లక్షల రూపాయలు ఆదా చేసినట్లు తెలుస్తోంది. ఒకరు ఏడాదికి రూ. 5.58 లక్షలు ఆదా చేస్తే.. ఢిల్లీకి చెందిన మరో వ్యక్తి రూ. 3 లక్షల వరకూ ఆదా చేసినట్లు తాజా నివేదికల్లో వెల్లడైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
‘నువ్వు ముస్లింవా?’ అని అడిగి 15 సార్లు కత్తితో పొడిచాడు..
‘నువ్వు ముస్లింవా?’ అని అడిగి 15 సార్లు కత్తితో పొడిచాడు..
బంగారం ధరలపై పండుగ చేసుకునే న్యూస్.. మరింత పతనం..!
బంగారం ధరలపై పండుగ చేసుకునే న్యూస్.. మరింత పతనం..!
రోహిత్‌తో గంభీర్ సీక్రెట్ మీటింగ్.. ప్రపంచకప్‌లో చోటుపై ఉత్కంఠ..?
రోహిత్‌తో గంభీర్ సీక్రెట్ మీటింగ్.. ప్రపంచకప్‌లో చోటుపై ఉత్కంఠ..?
టీటీడీ సరికొత్త రికార్డు.. ఒక్క ప్రకటనతో రూ. 96.98 కోట్ల విరాళాలు
టీటీడీ సరికొత్త రికార్డు.. ఒక్క ప్రకటనతో రూ. 96.98 కోట్ల విరాళాలు
రూ.220కే సిమెంట్ బస్తా.. ఇందిరమ్మ ఇండ్లకు తక్కువ ధరకే..
రూ.220కే సిమెంట్ బస్తా.. ఇందిరమ్మ ఇండ్లకు తక్కువ ధరకే..
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. 20 రోజుల పాటు ఆ రూట్‌ బంద్
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. 20 రోజుల పాటు ఆ రూట్‌ బంద్
కోహ్లీ బాడీగార్డ్ అహంకారం.. మీడియా ప్రతినిధిపై బూతు పురాణం..!
కోహ్లీ బాడీగార్డ్ అహంకారం.. మీడియా ప్రతినిధిపై బూతు పురాణం..!
రేపటి నుంచే దేశంలో తొలి హైడ్రోజన్ రైలు.. ఈ రూట్లోనే పరుగులు
రేపటి నుంచే దేశంలో తొలి హైడ్రోజన్ రైలు.. ఈ రూట్లోనే పరుగులు
విద్యుత్‌ శాఖలో AEE పోస్టుల రాత పరీక్ష వాయిదా..? తాజా అప్‌డేట్‌
విద్యుత్‌ శాఖలో AEE పోస్టుల రాత పరీక్ష వాయిదా..? తాజా అప్‌డేట్‌
జబర్దస్త్ జడ్జీగా ఇంద్రజ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అన్ని లక్షలా?
జబర్దస్త్ జడ్జీగా ఇంద్రజ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అన్ని లక్షలా?