స్కూలుకు డుమ్మాకొడితే.. అస్సలు ఊరుకోరు ఈ మాస్టారు.. ఏం చేస్తారంటే..

ప్రభుత్వ ఉపాధ్యాయుడు అంటే.. స్కూల్‎కు వచ్చిన పిల్లలకు ఏవో నాలుగు విద్యా బుద్ధులు నేర్పి నెల జీతం తీసుకునే అందరూ టీచర్ల మాదిరిగా కాదు ఈయన. పాఠశాలకు రాకుండా డుమ్మా కొడితే మాత్రం ఆ టీచర్ సహించరు. పిల్లల కోసం వారి ఇంటికే కాదు వ్యవసాయ బావులు వద్దకు కూడా వెళతారు. పిల్లలకు చదువు ప్రాముఖ్యతను వివరించి నచ్చజెప్పి తన బైక్ మీద పాఠశాలకు తీసుకొస్తుంటారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఆ టీచర్ ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

స్కూలుకు డుమ్మాకొడితే.. అస్సలు ఊరుకోరు ఈ మాస్టారు.. ఏం చేస్తారంటే..
Telangana
Follow us
M Revan Reddy

| Edited By: Srikar T

Updated on: Jul 22, 2024 | 5:28 PM

ప్రభుత్వ ఉపాధ్యాయుడు అంటే.. స్కూల్‎కు వచ్చిన పిల్లలకు ఏవో నాలుగు విద్యా బుద్ధులు నేర్పి నెల జీతం తీసుకునే అందరూ టీచర్ల మాదిరిగా కాదు ఈయన. పాఠశాలకు రాకుండా డుమ్మా కొడితే మాత్రం ఆ టీచర్ సహించరు. పిల్లల కోసం వారి ఇంటికే కాదు వ్యవసాయ బావులు వద్దకు కూడా వెళతారు. పిల్లలకు చదువు ప్రాముఖ్యతను వివరించి నచ్చజెప్పి తన బైక్ మీద పాఠశాలకు తీసుకొస్తుంటారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఆ టీచర్ ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

School Teacher

School Teacher

నల్లగొండ జిల్లా చండూరుకు చెందిన మహేశ్ 2009 మే నెలలో డీఎస్సీ పరీక్ష రాసి ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. కనగల్ మండలం రెగట్టే ప్రాథమిక పాఠశాలలో మొదటి పోస్టింగ్ వచ్చింది. 13 ఏళ్లుగా చెరుకుపల్లి, చామలపల్లి, జాన్ండా, దామెర, నెవిళ్లగూడెంలోని ప్రాథమిక పాఠశాల్లో పని చేశారు. ప్రస్తుతం ఆయన 2023లో దామెర ప్రాథమికోన్నత పాఠశాలకు డిప్యుటేషన్‎పై వచ్చారు. మహేష్ ఎక్కడ పనిచేసినా అంకితభావంతో పనిచేస్తారనే పేరు ఉంది. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా పిల్లలకు చదువు గొప్పతనాన్ని వివరిస్తుంటారు. బడీడు పిల్లలను స్కూల్లో చేర్పించడమే కాదు.. విద్యార్థుల హాజరుశాతం పెంచేందుకు మహేష్ కృషి చేసేవాడు. ఏయే తరగతుల విద్యార్థులు రాలేదో గుర్తించి మొదట ఆయా క్లాస్ లీడర్లను పంపించి వారిని రప్పిస్తుంటారు.

విద్యార్థులు కావాలని డుమ్మా కొడితే.. వారు ఎక్కడున్నా వెళ్లి తీసుకొస్తారు. ఇంటికి వెళ్లడమే కాదు అవసరమైతే వ్యవసాయ బావులు, పొలాల వద్దకైనా వెళ్లి తల్లిదండ్రులు, పిల్లలకు చదువు ప్రాముఖ్యతను వివరిస్తారు. వారి తల్లిదండ్రులను నచ్చజెప్పి తన బైక్‎పై పిల్లలను స్కూల్‎కు తీసుకు వస్తుంటారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడమే కాదు.. తాను పనిచేసే స్కూళ్ల అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థలు, ఎన్ఆర్ఐల సహకారంతో నిధులు సమకూరుస్తుంటారు. పిల్లలది తెలిసీ తెలియని వయస్సు కాబట్టి వారికి నచ్చజెప్పి స్కూళ్లకు రోజూరావడం అలవాటుగా చేయాలన్నదే తన ప్రధాన కర్తవ్యమని మహేశ్ చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..