మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం కిక్కిచ్చే న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మద్యం ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీర్ మినహాయించి ఇతర అన్ని బ్రాండ్‌లకు సంబంధించిన లిక్కర్‌పై ధరలు తగ్గిస్తూ ఉత్వర్వులు జారీ చేశారు. 750 ఎమ్‌ఎల్ బాటిల్‌పై రూ. 40, 375 ఎమ్‌ఎల్ బాటిల్‌పై రూ. 20, 180 ఎమ్‌ఎల్‌పై రూ. 10 తగ్గించారు. అయితే కొన్ని రకాల బ్రాండ్స్‌కు చెందిన లిక్కర్‌పై 750 ఎమ్‌ఎల్ బాటిల్‌పై రూ. 60 వరకు తగ్గించారు.
మద్యంపై ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో ఈ ధరలు తగ్గినట్లు ఆబ్కారీ అధికారులు తెలిపారు. తగ్గిన ధరలు ఈరోజు నుంచే అమల్లోకి వస్తాయని అధికారులు తెలిపారు. ఇక ధరలు ఎక్కువగా ఉన్న కారణంగా పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి మద్యం అక్రమంగా వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న ఆబ్కారీ శాఖ తెలిపింది. అయితే బీరు ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని అధికారులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..