
సోమవారం అచ్చంపేటలోని అమ్రాబాద్ మండలం మాచారంలో ఇందిర సౌర గిరి జల వికాసం పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్మించిన సీతారామాంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఓ ప్రభుత్వ ఆయన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్ననగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీగా పని చేస్తున్న ఐఏఎస్ ఏ.శరత్ ఆయన కాళ్లు మొక్కారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇక్కడ ఐఏఎస్ కాళ్లు మొక్కిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గమనించనట్టు తెలుస్తోంది. కానీ సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో సదరు ఐఏఎస్ అధికారిపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఐఏఎస్ అధికారులు రాజకీయ నాయకులతో ఉన్నపుడు బాధ్యతగా వ్యవరించాలి అంటూ తెలంగాణ సీఎస్ రామకృష్ణ మండిపడ్డారు. ఐఏఎస్ అధికారులు ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించకూడదని.. ప్రజా సమావేశాల్లో పాల్గొన్నప్పుడు అనుచిత ప్రవర్తన మానుకోవాలని అన్నారు. ఐఏఎస్ అధికారులే ఇలా ప్రవర్తిస్తే ప్రజల్లో అధికారుల పట్ల ఉన్న నమ్మకం తగ్గుతుందని ప్రభుత్వం హెచ్చరించింది. అధికారి ఎల్లప్పుడు పరిపూర్ణ నిజాయితీతో ఉండాలని సూచించింది.
అలా కాదని 1968 ఎఐఎస్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. ఇకపై ఇలాంటి చర్యలు జరిగే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పింది. ఐఏఎస్ అధికారుల అనుచిత ప్రవర్తనపై క్రమశిక్షణ చర్యలు తప్పవని..ప్రజల్లో గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే అధికారుల తీరు మారాలని సీఎస్ చాలా గట్టిగా చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా 1964 తెలంగాణ సివిల్ సర్వీసెస్ రూల్స్ అతిక్రమించొద్దు అని ఆదేశాలు జారీ చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..