CM KCR: నవ ధాన్యాలతో రూపొందించిన సీఎం కేసీఆర్ నిలువెత్తు చిత్ర పటాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహుకరించారు. ఆర్టిస్ట్ గొట్టేటి బాలకృష్ణ, ఆయన కూతురు సాయిశ్రీ కలిసి 6 అడుగుల ఎత్తు , 4 అడుగుల వెడల్పుతో రూపొందించిన ఈ చిత్ర పటాన్ని దశాబ్ది ఉత్సవాల్లో సత్తుపల్లి రైతువేదికలో ప్రదర్శించినట్లు ఎమ్మెల్యే సీఎంకు వారు వివరించారు. నవధాన్యాలను ఈ చిత్రపటాన్ని రూపొందించడానికి ఉపయోగించామని, ఎక్కడా ఆర్టిఫిషియల్ గమ్ లేదా స్టిక్కర్లు కానీ ఉపయోగించలేదని చెప్పారు. తెలంగాణను అన్నపూర్ణగా మార్చిన కేసీఆర్‌కి ఇది తమ ఆత్మీయ బహుమతి అంటూ వారు చెప్పుకోచ్చారు.
కాగా, గొట్టేటి బాలకృష్ణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఖమ్మంలో కొన్ని రోజులపాటు నవధాన్యాల కేసీఆర్ చిత్రపటాన్ని ప్రదర్శించారు. కొన్ని వందల మంది దీన్ని చూసి చాలా బాగుందని ప్రశంసించడంతో… ఉత్సవాలు ముగిసేక కెసిఆర్‌కి దీన్ని బహుకరించాలని భావించి ప్రత్యేకంగా ఆయన కోసం ప్రగతి భవన్‌కు తీసుకొచ్చారని వారు తెలిపారు. కెసిఆర్ కూడా చిత్రపటాన్ని చూసి తెలంగాణలోనే నవధాన్యపు రాశులతో చేసిన విధానం బాగుందని ప్రశంసించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.