
Increases Singareni Employees Retirement Age: సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 26 తేదీన జరిగే బోర్డు మీటింగ్‌లో చర్చించి, అమలుపై విధాన నిర్ణయం తీసుకోవాలని సింగరేణి ఎండీ శ్రీధర్‌ను నిర్ణయిచారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, కోల్‌బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయానికి సానుకూలత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ జీవో జారీ చేసింది. కాగా, మార్చి 31 నుంచి రిటైర్ అవుతున్న కార్మికులందరికీ ఇది వర్తించనుంది. దీంతో 43,899 మంది కార్మికులు, అధికారులకు లబ్ధి చేకూరనుంది.
అయితే, ఇప్పటికే మధ్యంతర పదవీ విరమణ పొందిన కార్మికులను వెంటనే విధుల్లో చేరాలని సింగరేణి అధికారులు పేర్కొన్నారు. దీంతో మార్చి 31 నుంచి ఇప్పటివరకు రిటైర్ అయిన 1,082 మంది కార్మికులు తిరిగి ఉద్యోగాల్లో చేరనున్నారు. కాగా, ఇటీవల సమస్యలు, పరిష్కారాలపై సింగరేణి ప్రాంత ప్రజా ప్రతినిధులతో ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. సింగరేణి భూముల్లో ఉంటున్నవారికి స్థలాల క్రమబద్ధీకరణ చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. 30 వేల మందికి లబ్ధి చేకూరను న్నందున ఆలస్యం చేయొద్దని ఆదేశించారు.
మరోవైపు, రిటైర్మెంట్ ఏజ్ 61కి పెంచడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సింగరేణి కార్మికులు. డిపెండెంట్స్ ఉద్యోగం పొందే అకాశం కోల్పోయే అవకాశం ఉందంటున్నారు. అయితే ఈ నిర్ణయానికి కోలిండియా డైరెక్టర్ తో పాటు కేంద్ర ప్రభుత్వ డైరెక్టర్లు ఆమోదం తెలుపుతూ సంతకాలు చేయాల్సి ఉందంటున్నారు కార్మిక సంఘాల నేతలు. అప్పటివరకు వయోపరిమితి పెంపు వర్తించదంటున్నారు.
వయస్సు పెంపుతో తమ పిల్లలకు డిపెండెంట్ ఉద్యోగాలు రావని కార్మికులు భయపడుతున్నారు. డిపెండెంట్ల ఏజ్ లిమిట్ ఇప్పటివరకు 35 ఏళ్లు వుంది. కార్మికుని వయస్సు పెరగడం వల్ల డిపెండెంట్ వయస్సు కూడా పెరుగుతుంది. దీంతో డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ ని కార్మికుని వారసులు కోల్పోనున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Also… GSLV F10: ఒకటి.. రెండు దశలు బాగానే సాగినా.. మూడోదశలో విఫలం.. ఇస్రో ప్రయోగం ఫెల్యూర్‌కు కారణాలు ఇవే..