TS RTC: తెలంగాణ ప్రయాణికులకు శుభవార్త.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ మరో కీలక నిర్ణయం.. ఆ సేవలు ప్రారంభం

|

Oct 25, 2021 | 9:34 AM

TS RTC: తెలంగాణ ఆర్టీసీ ముందే నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆర్టీసీని గాడిలో..

TS RTC: తెలంగాణ ప్రయాణికులకు శుభవార్త.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ మరో కీలక నిర్ణయం.. ఆ సేవలు ప్రారంభం
Follow us on

TS RTC: తెలంగాణ ఆర్టీసీ ముందే నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు ప్రయాణాకుల కోసం మెరుగైన సేవలు అందిస్తూ వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నారు. అయితే సజ్జనార్‌ తన మార్క్ నిర్ణయాలతో సంస్థలో కొత్త ఉత్తేజం నింపుతున్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందడంతో పాటు, సంస్థను లాభాల దిశగా నడిపేందుకు ఆయన చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల ఆయన చేపట్టిన చర్యలు ప్రయాణికుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాయి.

ఇక నిరాశలో కొట్టుమిట్టాడుతున్న సంస్థ ఉద్యోగుల్లో కొత్త ఉత్తేజం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బస్టాండ్ లలో వివిధ సేవలకు డబ్బులను యూపీఐ, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు సేవలను ఇటీవల ప్రయోగాత్మకంగా ప్రారంభించారు సజ్జనార్‌. మహాత్మాగాంధీ బస్​స్టేషన్ (MGBS)లోని టికెట్ రిజర్వేషన్ కౌంటర్, పార్శిల్-కార్గో కేంద్రం, సికింద్రాబాద్​లోని రేతిఫైల్ బస్​పాస్ కౌంటర్‌లలో యూపీఐ, క్యూఆర్ కోడ్ సేవలు పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభమయ్యాయి. అయితే ఈ సేవలను ప్రారంభించిన సమయంలో ఆర్టీసీ ఎండీ ప్రయాణికులు ఈ సర్వీసులపై తమ అభిప్రాయాలు, సూచనలు ట్విట్టర్ ద్వారా తెలియజేయాలని కోరారు.

జూబ్లీ బస్‌ స్టేషన్‌లోనూ..
ఇక జూబ్లీ బస్ స్టేషన్ లోనూ యూపీఐ, క్యూఆర్ కోడ్ ద్వారా నగదు చెల్లింపు సేవలను ప్రారంభిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తాజాగా ప్రకటించారు. పార్సెల్, కార్గో బుకింగ్, బస్ పాస్ కౌంటర్లలో ఈ సేవలను ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సేవలను ప్రయాణికులు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ మేరకు సజ్జనార్ ట్వీట్ చేశారు. రానున్న రోజుల్లో ఈ సేవలను అన్ని బస్టాండ్లకు ఈ సేవలు విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

 

ఇవీ కూడా చదవండి:

TRS Plenary: గులాబీమయం కానున్న హైదరాబాద్‌.. టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో ప్రవేశపెట్టే తీర్మానాలు ఇవే..!

Baby Born on Plane: విమాన ప్రయాణంలో జన్మించిన శిశువుకు ఏ దేశ పౌరసత్వం లభిస్తుంది..? ఆసక్తికర విషయాలు..!