ఉస్మానియాలో చదివే విద్యార్థులకు శుభవార్త.. ఈ ఏడాది నుంచి దూర విద్యలో 70 కోర్సులు

ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ జీ రామ్‌ రెడ్డి సెంటర్‌ ఫర్‌ డిస్టన్స్‌ ఎడ్యుకేషన్‌ విద్యార్థులకు శుభవార్త తెలిపింది. ఈ ఏడాది నుంచి దూరవిద్యలో 70 కోర్సులను నిర్వహించనున్నట్లు పేర్కొంది.

ఉస్మానియాలో చదివే విద్యార్థులకు శుభవార్త.. ఈ ఏడాది నుంచి దూర విద్యలో 70 కోర్సులు
Osmania University

Updated on: Mar 19, 2023 | 6:33 PM

ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ జీ రామ్‌ రెడ్డి సెంటర్‌ ఫర్‌ డిస్టన్స్‌ ఎడ్యుకేషన్‌ విద్యార్థులకు శుభవార్త తెలిపింది. ఈ ఏడాది నుంచి దూరవిద్యలో 70 కోర్సులను నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ ఇటీవలే అనుమతి ఇచ్చింది. ఓయూ అనుబంధంగా పీజీఆర్‌ఆర్‌సీడీఈ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి క్యాటగిరీ1 విద్యాసంస్థలు యూజీసీ నుంచి ఎలాంటి అనుమతి పొందకుండానే దూర విద్య కోర్సులను నిర్వహించవచ్చు. కానీ ఓయూ క్యాటగిరీ1 విద్యా సంస్థ అయినా తమ నుంచి అనుమతి పొందాలని యూజీసీ లేఖ రాసింది. ఈ మేరకు ఓయూ అధికారులు 70 కోర్సులకు అనుమతి ఇవ్వాలని కోరుతూ యూజీసీకి దరఖాస్తు చేశారు. దీంతో యూజీసీ ఓయూతోపాటు క్యాటగిరీ 1 వర్సిటీల్లో కోర్సులకు అనుమతి ఇచ్చింది. ఆంధ్రా వర్సిటీ, కురుక్షేత్రవర్సిటీల్లో 21 కోర్సుల చొప్పున అనుమతిని జారీచేసింది. దీంతో ఉస్మానియా యూనివర్శిటీకి ఐదేండ్ల పాటు గుర్తింపునివ్వడం మరో విశేషం.

పీజీఆర్‌ఆర్‌సీడీఈలో మరో ఐదు కోర్సులు ప్రవేశపెట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వీటిలో ఒక పీజీ, ఒక డిగ్రీ కోర్సులుండగా, మరో మూడు కోర్సులకు రూపకల్పన చేస్తున్నారు. కొత్తగా ఈ ఏడాది పీజీ డిప్లొమా ఇన్‌ డాటాసైన్స్‌, వేదిక్‌ ఆస్ట్రాలజి డిప్లొమా కోర్సు, ఆంత్రోపెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌, యోగా సర్టిఫికెట్‌ కోర్సులు నడుస్తున్నాయి. వర్సిటీల వారిగా అనుమతి పొందిన కోర్సులు గమనిస్తే ఉస్మానియాకి 70, ఆంధ్రా యూనివర్శిటీకి 21, హర్యానాలోని కురుక్షేత్ర వర్శిటీకి 21, మహారాష్ట్రలో భారతీవిద్యాపీఠ్ కు 09, ఒడిశాలోని ఉత్కల్ వర్శిటీకి 17, పంజాబ్ లోని గురునానక్ దేవ్ వర్శిటీకి 8 కోర్సులు నిర్వహించనున్నారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..