తీరనున్న సాధారణ ప్రయాణీకుల ఇక్కట్లు.. జనరల్ బోగీలను పెంచనున్న సౌత్ సెంట్రల్ రైల్వే

| Edited By: Surya Kala

Dec 05, 2024 | 12:35 PM

రైలు లో జనరల్ బోగీలో ప్రయాణం చేయాలంటే నరకం చూడాల్సిందే.. ఇంకా చెప్పాలంటే అసలు జనరల్ బోగీలోకి ఎక్కాలన్న యుద్ధం చేయాల్సిందే.. అయితే ఇక నుంచి జనరల్ బోగీలో ప్రయాణించే ప్రయాణీకుల ఇబ్బందులకు చెక్ పెట్టనున్నారు. అవును ఇప్పుడు ఆ ఇబ్బంది ఉండదు అంటోంది సౌత్ సెంట్రల్ రైల్వే..

తీరనున్న సాధారణ ప్రయాణీకుల ఇక్కట్లు.. జనరల్ బోగీలను పెంచనున్న సౌత్ సెంట్రల్ రైల్వే
South Central Railway
Follow us on

ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్ రైళ్లలో జనరల్ బోగీల సంఖ్యను దశలవారీగా పెంచుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు రెండే జనరల్ కోచ్ లు ఉన్న రైళ్లలో ఆ సంఖ్యను నాలుగుకు చేరుస్తున్నట్లు పేర్కొన్నారు. అవి కూడా ఆధునిక పరిజ్ఞానం కలిగిన ఎల్.హెచ్.బి కోచ్ లు ఉంటాయని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు. జోన్ పరిధిలోని 21 జతల రైళ్లకు అదనగా 80 ఎల్.హెచ్.బి బోగీలను అందుబాటులోకి తీసుకొస్తామన్న సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు.

రైళ్లలో పేదలు ప్రయాణించే జనరల్ బోగీల రూపం కూడా మారబోతున్నది. ఇన్నాళ్లు రైళ్లలో పాతకాలం నాటి సాధారణ బోగీలే ఉన్నాయి. చాలా రైళ్లలో రెండే బోగీలు ఉండటంతో పేద ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దాని కారణంగా జనరల్ బోగీల సంఖ్యను పెంచేందుకు రైల్వేబోర్డు కార్యాచరణ ప్రారంభించింది. కొత్తగా వస్తున్న జనరల్ బోగీలను ఎల్.హెచ్.బి పరిజ్ఞానంతో తయారుచేసినవి ప్రవేశ పెడుతున్నారు. పాత తరం ఐసీఎఫ్ బోగీల్లో 90 సీట్లు ఉంటే.. ఎల్.హెచ్.బి బోగీల్లో సీట్ల సంఖ్య 100 ఉంటాయి. ఇందులో ఎక్కువ మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది. ప్రమాదాలు జరిగినప్పుడు సైతం తక్కువ నష్టం ఉంటుందంటున్న రైల్వే అధికారులు.

ఏసీ, స్లీపర్ క్లాస్ లలో మాత్రమే ఎల్.హెచ్.బి బోగీలను రైల్వే శాఖ ప్రవేశపెడుతూ వచ్చింది. కానీ తాజాగా ఇప్పుడు జనరల్ క్లాస్ లలో ఎల్.హెచ్.బి కోచ్ లను అందుబాటులోకి ఇస్తున్న సౌత్ సెంట్రల్ రైల్వే.
ఇప్పటికే జోన్ పరిధిలో 19 ఎక్స్ ప్రెస్ రైళ్లకు ఎల్.హెచ్.బి కోచ్లను 66 కోచ్లను ప్రవేశపెట్టారు.

ఇవి కూడా చదవండి

గౌతమి, దక్షిణ్, నారాయణాద్రి తదితర ఎక్స్ప్రెస్ రైళ్లలో అదనంగా ఎల్.హెచ్.బి జనరల్ కోచ్ లు వచ్చాయి. రైల్వేశాఖ దేశవ్యాప్తంగా 370 రైళ్లలో అదనంగా ఎల్.హెచ్.బి బోగీలను దశలవారీగా జత చేస్తోందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఫలితంగా రోజూ అదనంగా 70 వేల మంది ప్రయాణికులు జనరల్ బోగీల్లో ప్రయాణించేందుకు ఆస్కారం ఉంటుంది. సాధారణ ప్రయాణికులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..