Telangana: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సర్కార్ కీలక ప్రకటన..

తెలంగాణ రాష్ట్రంలో చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి గోద్రెజ్ క్యాపిటల్‌తో ప్రభుత్వ ఒప్పందం కీలక మలుపుగా మారనుంది. ఎంఎస్ఎంఈల కోసం రూపొందించిన ఈ భాగస్వామ్యం వేల మందికి ఆర్థికంగా పునాదులు వేసే అవకాశముంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి లుక్కేయండి.

Telangana: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సర్కార్ కీలక ప్రకటన..
CM Revanth Reddy

Edited By: Ravi Kiran

Updated on: Apr 09, 2025 | 9:13 PM

తెలంగాణ రాష్ట్రంలో చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి గోద్రెజ్ క్యాపిటల్‌తో ప్రభుత్వ ఒప్పందం కీలక మలుపుగా మారనుంది. ఎంఎస్ఎంఈల కోసం రూపొందించిన ఈ భాగస్వామ్యం వేల మందికి ఆర్థికంగా పునాదులు వేసే అవకాశముంది. స్పెషలైజ్డ్ రుణ స్కీమ్‌లు, డిజిటల్ ఫైనాన్స్ పరిష్కారాలతో కొత్త కొత్త వ్యాపారాలకు ఊతమివ్వనుంది. రాష్ట్రవ్యాప్తంగా చిన్న వ్యాపారులకు రుణాల యాక్సెస్ పెరగడం ద్వారా కొత్త ఉద్యోగ అవకాశాలు, స్వయం ఉపాధి మార్గాలు పెరగబోతున్నాయి. మొదటిసారిగా వ్యాపారంలోకి అడుగుపెట్టే వారికి ఈ భాగస్వామ్యం పెద్ద వనరుగా మారనుంది. ప్రత్యేకించి మహిళా పారిశ్రామికవేత్తలకు ఇది మంచి అవకాశం.

తెలంగాణ MSME పాలసీ 2024లో ప్రాముఖ్యంగా చెప్పిన క్రెడిట్ యాక్సెస్, డిజిటల్ అడాప్షన్, మౌలిక వసతుల అభివృద్ధి అంశాలపై గోద్రెజ్ క్యాపిటల్ పాత్ర కీలకంగా మారనుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, వేగవంతమైన లోన్ ప్రాసెసింగ్‌తో గోద్రెజ్ ఆర్థిక రంగంలో కొత్త తరహా వేగం తీసుకురానుంది. హైదరాబాద్, వరంగల్, రంగారెడ్డి వంటి నగరాలతో పాటు పట్టణాలకే పరిమితమయ్యే ఈ భాగస్వామ్యం కాదు. జిల్లా స్థాయిలోని వ్యాపారులకు కూడా గోద్రెజ్ క్యాపిటల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇది గ్రామీణ అభివృద్ధికి బలమైన ఆధారంగా మారే ఛాన్స్ ఉంది.