Telangana: హరిత తెలంగాణ సాధనే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతోన్న హరితహారం కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తోన్న విషయం తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న ఈ కార్యక్రమానికి రాజకీయ నాయకుల నుంచే కాకుండా ఇతర వర్గాల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. ఇటీవల ‘సేవ్ సాయిల్’ పేరుతో కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ వచ్చిన సద్గురు జగ్గీ వాసుదేవ్ సైతం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమాన్ని అభినందించారు. ఈ నేపథ్యంలో తాజాగా హరితహారం కార్యక్రమంపై అంతర్జాతీయ ప్రముఖులు సైతం ప్రశసలు కురిపిస్తారు.
పర్యావరణ పరిరక్షణ కోసం పచ్చదనం పెంచాలని లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంపై ప్రముఖ పర్యావరణ వేత్త, గ్లోబల్ అలయన్స్ ఫర్ సస్టైనబుల్ ప్లానెట్ నిర్వహకులు ఎరిక్ సోల్హిము ప్రశంసలు కురిపించారు. తాజాగా 8వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చెట్ల పెంపకం కోసం డ్రోన్లను ఉపయోగిస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఎరిక్ ట్వీట్ చేశారు.
Bravo Telangana!
Telengana leads India ?? and the world in treeplanting and greenery.The flagship program #Harithaharam makes afforestation at inaccessible areas. Seeded with seedballs delivered by drones.@TelanganaCMO @DharaniR_
— Erik Solheim (@ErikSolheim) June 20, 2022
మనుషులు వెళ్లలేని ప్రదేశాలకు డ్రోన్‌ల ద్వారా విత్తనాలను జల్లుతున్న వీడియోను పోస్ట్ చేస్తూ.. ‘పచ్చదనం పెంపొందించడం, చెట్లను పెంచడంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. హరితహారం ప్రోగ్రామ్‌లో భాగంగా మనుషులు వెళ్లడానికి వీలులేని చోట్ల కూడా డ్రోన్‌ల సహాయంతో విత్తనాలను జారవిడుస్తున్నారు’ అంటూ రాసుకొచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..