ఈ జాతి ఆవులు ఉంటే.. రైతుల పాలిట కాసుల పంటే.. ధర ఎంతో తెలుసా..

| Edited By: Srikar T

Feb 18, 2024 | 12:57 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేటలోని గుర్రాల చెరువు గ్రామానికి చెందిన సుబ్బరాజు అనే రైతు గిరిజాతికి చెందిన ఆవుల పోషణ చేపట్టారు. వాటి వల్ల కలిగే ఉపయోగాలు, లాభాలు తెలుసుకొని గుజరాత్ రాష్టం నుండి కొనుగోలు చేశారు. తన పొలంలో వాటి పోషణ చూసుకుంటున్నారు.

ఈ జాతి ఆవులు ఉంటే.. రైతుల పాలిట కాసుల పంటే.. ధర ఎంతో తెలుసా..
Giri Breed Cow
Follow us on

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేటలోని గుర్రాల చెరువు గ్రామానికి చెందిన సుబ్బరాజు అనే రైతు గిరిజాతికి చెందిన ఆవుల పోషణ చేపట్టారు. వాటి వల్ల కలిగే ఉపయోగాలు, లాభాలు తెలుసుకొని గుజరాత్ రాష్టం నుండి కొనుగోలు చేశారు. తన పొలంలో వాటి పోషణ చూసుకుంటున్నారు. ఈ ఆవుల వల్ల ఉపయోగాలు తెలుసుకొన్న మరికొంతమంది రైతులు ఈ జాతి ఆవుల పెంపకం కోసం ఉత్సాహం చూపుతున్నారు. సాధారణంగా ఉమ్మడి రాష్ట్రంలో ఆవు ఖరీదు రూ. 20 నుండి రూ. 30 వేలు ఉంటుంది. మామూలు ఆవులు రోజుకు 2 లీటర్ల పాలు ఇస్తాయని, కానీ గిరిజాతి ఆవులు రోజుకు 5 లీటర్ల పాలు ఇస్తాయని రైతులు అంటున్నారు.

అంతే కాకుండా ఈ పాల నుండి వచ్చే నెయ్యి ఆయుర్వేద ఔషదాలలో వాడతారని, వీటి పాలు, గో పంచకానికి మంచి డిమాండ్ ఉంటుందని చెబుతున్నారు. అలాగే కేజీ వెన్న 7000 రూపాయలకు పైగానే ఉంటుందని తెలిపారు. వీటి పాలను 10 రోజులు మరగపెట్టి వాటి నుండి వచ్చే కెమికల్ ద్వారా, పామ్ ఆయిల్, కొబ్బరి, జామ తోటలకు తెల్ల దోమ కాటు నుండి సంరక్షణకు వాడతారని పేర్కొన్నారు. వీటి మూత్రం పంటలకు రక్షణ, అధిక పోషకాలుగా బాగా పని చేస్తుందని చెప్పారు. ఈ గిరిజాతి ఆవుల వల్ల లాభాలే కాకుండా ఆరోగ్య సమస్యలకు ఎంతో ఉపయోగపడుతుందని రైతులు తెలిపారు. ఈ ఆవులకు ప్రస్తుతం డిమాండ్ బాగా పెరిగిందని.. దీంతో ఈ ఆవుల పెంపకంపై స్థానిక రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..