Python: వామ్మో.. ఇది ఇంత ఉంది ఏంట్రా.. పరుగులు తీసిన జనం

| Edited By: Ram Naramaneni

Dec 04, 2024 | 7:08 PM

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం మైలారం పరిసర ప్రాంతాల్లో స్థానికులకు ఓ భారీ పైథాన్ కనిపించింది. దాని పొడవు సుమారుగా 15 అడుగులు ఉంది. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు నిజామాబాద్​ పట్టణానికి చెందిన స్నేక్ క్యాచర్ మల్లేశ్​కు సమాచారమిచ్చారు.

Python: వామ్మో.. ఇది ఇంత ఉంది ఏంట్రా.. పరుగులు తీసిన జనం
Giant Python
Follow us on

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 అడుగుల పొడవున్న కొండచిలువ నిజామాబాద్ జిల్లా మైలారం గ్రామంలో హల్ చల్ చేసింది.. దట్టమైన అడవుల్లో కనిపించే భారీ కొండచిలువ జననావాసాల మధ్యన ప్రత్యక్షమైంది.. ఈ అతి పొడవైన కొండ చిలువను చూసి జనాలు భయంతో పరుగులు తీశారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం అటవీ ప్రాంతాలకు పెట్టింది పేరు.. ఇక్కడ తరచుగా వన్యప్రాణులు పాములు జననావాసాల మధ్య కనిపిస్తుంటాయి.. చిన్న చిన్న పాములు విష పాములు అప్పుడప్పుడు కనిపించడం ఇక్కడ సర్వసాధారణం.. ఇక్కడి ప్రజలు కూడా పెద్దగా వాటిని పట్టించుకోరు.. కానీ ఏకంగా 15 అడుగుల పొడవున్న కొండచిలువ ప్రత్యక్షం అవడంతో జనం ఒక్కసారిగా అవాక్కయ్యారు. భయంతో పరుగులు తీశారు.

నిజామాబాద్ పట్టణానికి చెందిన స్నేక్ క్యాచర్ మల్లేశ్‌కు సమాచారమిచ్చారు. ఆయన వెంటనే కొండ చిలువ ఉన్న ప్రాంతానికి చేరుకుని సుమారు గంటపాటు శ్రమించి దాన్ని పట్టుకున్నారు. పదిహేను అడుగుల పొడవు ఉన్న ఈ పామును సురక్షితంగా దగ్గరలోని దట్టమైన అడవి ప్రాంతంలో వదిలిపెట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..