Hyderabad: భాగ్యనగరంలో ఆ మూడు రోజులు ఇంటింటికి బూస్టర్ డోసు బంద్.. ఎందుకంటే..

|

Feb 25, 2022 | 6:11 PM

Hyderabad: కరోనా వైరస్(Corona Virus) నివారణ కార్యక్రమంలో భాగంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు, 60 ఏళ్లకు పై బడిన వృద్ధులకు బూస్టర్ డోసు (Booster Dose)ని ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మహా నగరంలో..

Hyderabad: భాగ్యనగరంలో ఆ మూడు రోజులు ఇంటింటికి బూస్టర్ డోసు బంద్.. ఎందుకంటే..
Follow us on

Hyderabad: కరోనా వైరస్(Corona Virus) నివారణ కార్యక్రమంలో భాగంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు, 60 ఏళ్లకు పై బడిన వృద్ధులకు బూస్టర్ డోసు (Booster Dose)ని ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మహా నగరంలో ఈ కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ సిబ్బంది ఇంటింటికి వెళ్లి నిర్వహిస్తున్నారు. అయితే ఇలా బూస్టర్ డోస్ వేసేందుకు జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్ నెంబర్ 040-2111 1111 ఏర్పాటు చేసింది. ఇలా సెంటర్ కు ఫోన్ చేస్తే ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ ను ఇస్తుంది. అయితే ఇలా బూస్టర్ డోసు ఇచ్చే కార్యక్రమం 3 రోజుల పాటు ఉండదని జీహెచ్ఎంసీ సిబ్బంది తెలిపారు.

ఇంటింటికి వెళ్లి బూస్టర్డోస్ వేసే ఆరోగ్య సిబ్బంది..  ఈ నెల 27వ తేదీన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 27, 28 మార్చి 01వ తేదీలలో బూస్టర్ డోస్ ప్రోగ్రామ్ ఉండదని అధికారులు చెప్పారు. బూస్టర్ డోసు కార్యక్రమం తిరిగి మార్చి 2వ తేదీ నుండి నిర్వహించనున్నామని ప్రకటించారు. ఈ విషయంలో ప్రజలు సహకరించాలని జీహెచ్ఎంసీ అధికారులు కోరారు.

Also Read:

 ఇంటర్నేషనల్ స్పేష్ స్టేషన్‌ను కూల్చేస్తాం.. యూరప్, అమెరికాలకు రష్యా స్ట్రాంగ్ వార్నింగ్..

నిర్మాతలకు మద్దతుగా థియేటర్ల ముందు పవన్ ఫ్యాన్స్ హుండీలు ఏర్పాటు.. విరాళాల సేకరణ