Medaram Jatara: మేడారం జాతరకు వెళ్లేవారికి బిగ్ అప్డేట్.. ఈ సారి ప్రభుత్వం కొత్త నిర్ణయం.. చరిత్రలో ఇదే తొలిసారి..

మేడారం జాతరలో దాదాపు 13 వేల మంది పోలీసులు భద్రత పర్యవేక్షించనున్నారు. ఈ మేరకు ఎలాంటి తొక్కిసలాట జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకోనున్నారు. అలాగే గత జాతరలో 30 వేల మంది వరకు తప్పిపోయారు. దీంతో ఈ సారి తప్పిపోయినవారిని గుర్తించేందుకు జియో ట్యాగింగ్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు.

Medaram Jatara: మేడారం జాతరకు వెళ్లేవారికి బిగ్ అప్డేట్.. ఈ సారి ప్రభుత్వం కొత్త నిర్ణయం.. చరిత్రలో ఇదే తొలిసారి..
Medaram Jatara

Edited By:

Updated on: Jan 19, 2026 | 12:44 PM

తెలంగాణ కుంభమేళాగా పేరు గాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు వేళాయే. ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా ప్రాముఖ్యత సంపాదించుకున్న ఈ జాతర ఈ నెల 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 31 వరకు నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ మహా జాతరకు ఇప్పటికే ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. మరో 10 రోజులు మాత్రమే సమయం ఉండటంతో పనులను షురూ చేసింది. భక్తులు అసౌకర్యానికి గురి కాకుండా క్యూలైన్లు, బస్సు ఫెలిసిటీ, పార్కింగ్, నీళ్లు, ఇతర మౌలిక సదుపాయల ఏర్పాట్లను శరవేగంగా చేపడుతోంది. భక్తులు తమ మొక్కులు చెల్లించుకునేందుకు లక్షలాదిగా వస్తూ ఉంటారు. దీంతో వారికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మొక్కలు చెల్లించుకునేలా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే మేడారం జాతర ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి అధికారులు కీలక ఆదేశాలిచ్చారు.

జియో ట్యాగింగ్ వ్యవస్ధ

మేడారం జాతరకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. దీంతో తొక్కిసలాట జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భారీ రద్దీ కారణంగా పిల్లలు, వృద్దులు తప్పిపోయే ప్రమాదం ఉంటుంది. దీంతో జాతరలో తప్పిపోయినవారిని సులువుగా గుర్తించేందుకు ప్రభుత్వం కొత్త కాన్సెప్ట్ ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకోనుంది. పిల్లలు, వృద్దులకు జియో ట్యాగింగ్ ఇవ్వనున్నారు. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి వీరికి క్యూర్ కోడ్‌తో కూడిన జియో ట్యాగింగ్ ట్యాగ్ కడతారు. తప్పిపోయిన సమయంలో వారి వద్ద ఉన్న క్యూఆర్ కోడ్ ట్యాగ్ స్కాన్ చేయడం ద్వారా వారి వివరాలు అన్నీ తెలుస్తాయి. దీంతో వల్ల తప్పిపోయినవారిని సులువుగా గుర్తించవచ్చు. ఇటీవల శబరిమలలో ఈ కాన్సెప్ట్ సక్సెస్ కావడంతో మేడారం జాతరలో కూడా ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ట్యాగ్ స్కాన్ చేయగానే తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ, తమిళ భాషల్లో వివరాలు కనిపించేలా ఏర్పాటు చేనున్నారు.

వొడాఫోన్-ఐడియా సహకారం

జియో ట్యాగింగ్ కోసం వొడాఫోన్-ఐడియా సహకారం ప్రభుత్వం తీసుకోనుంది. ఇందుకోసం జియోట్యాగ్ బేస్డ్ మిస్సింగ్ పర్సన్స్ ట్రాకింగ్ సిస్టమ్‌ను వొడాఫోన్ ఐడియా అభివృద్ది చేస్తోంది. తాడ్వాయి, పస్రా మార్గాల్లో స్పెషల్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. పిల్లలు, వృద్దులకు ఇక్కడ ట్యాగ్ కడతారు. ఆ ట్యాగ్ సహాయంతో ఎవరైనా తప్పిపోతే కనిపెట్టవచ్చు. ఇక భద్రత కోసం ఏఐ డ్రోన్లను పోలీస్ శాఖ ఉపయోగిస్తోంది. జాతర జరిగే ప్రాంతాల్లో ఈ డ్రోన్లు నిరంతరం గస్తీ కాస్తూ ఉంటాయి. అలాగే గాల్లో ఎగిరే హీలియం బెలూన్లకు పాన్ టిల్ట్ జూమ్ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా ఎక్కడిక్కడ భక్తుల రద్దీని గుర్తించి తొక్కిసలాట జరగకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు.