Fire Accident: మంచిర్యాల జిల్లాలో ఘోర ప్రమాదం.. గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం..

|

Feb 04, 2022 | 9:08 AM

Fire Accident: మంచిర్యాల(Mancherial) జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం(Fire Accident) చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్(Gas Cylinder) పేలి రేకుల..

Fire Accident: మంచిర్యాల జిల్లాలో ఘోర ప్రమాదం.. గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం..
Follow us on

Fire Accident: మంచిర్యాల(Mancherial) జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం(Fire Accident) చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్(Gas Cylinder) పేలి రేకుల ఇల్లు దగ్ధమైంది. ఇంట్లో(House) ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా వేమనపల్లి గ్రామానికి చెందిన ఆశాలు (38) రేకుల ఇల్లు గ్యాస్ సిలిండర్ పేలడంతో దగ్ధమైంది. ఇంట్లోని వారందరూ గ్రామంలోని ఓ పెళ్లికి హాజరైన సమయంలో ఇది చోటుచేసుకుంది. ఆశాలు కుటుంబం ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో చిన్నపాటి రేకుల ఇల్లు నిర్మించుకుని అందులోనే ఉంటున్నారు. కుటుంబ సభ్యులంతా గ్రామంలో జరుగుతున్న పెళ్లికి వెళ్లిన సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వివరాలు సేకరించి కేసు నమోదు చేయనున్నట్లు నీల్వాయి ఎస్‌ఐ తెలిపారు.

Also read:

Chanakya Niti: చాణక్య చెప్పిన ఈ 5 మంత్రాలు.. మీ వ్యక్తిత్వాన్నే మార్చేస్తాయి..

PSL 2022: 4 ఓవర్లు, 8 సిక్సులు, 67 పరుగులు.. పాక్ మాజీ బౌలర్‌ను ఉతికారేసిన బ్యాట్స్‌మెన్స్..!

Building Collapse: నిర్మాణంలో ఉన్న మాల్ భవనం కూలి.. ఐదుగురు దుర్మరణం.. పనులు చేస్తుండగా..