Viral: అటుగా వచ్చిన భారీ ట్యాంకర్.. డ్రైవర్‌ను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు.. చివరకు..

|

Oct 31, 2024 | 7:53 PM

పుష్ప సినిమా తరహాలో ట్యాంకర్లో భారీ మొత్తంలో తరలిస్తున్న గంజాయిను పోలీసులు పట్టుకున్నారు. సినీ ఫక్కీలో గంజాయి స్మగ్లింగ్‌ చేస్తుండగా.. గంజాయ్ గుట్టును రట్టు చేశారు. ఈ ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి అంతర్ రాష్ట్రీయ చెక్ పోస్ట్ వద్ద గురువారం జరిగింది.

Viral: అటుగా వచ్చిన భారీ ట్యాంకర్.. డ్రైవర్‌ను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు.. చివరకు..
Crime News
Follow us on

పుష్ప తగ్గేదేలే.. పుష్ప సినిమాలోని ఈ డైలాగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. దాదాపుగా పుష్ప సినిమాను అందరూ చూసే ఉంటారు.. దీనిలో ప్రధానంగా స్మగ్లింగ్ చుట్టూ కథ కొనసాగుతుంది.. అయితే, స్మగ్లింగ్ ఎలా చేస్తారు.. అడ్డగోలుగా డబ్బులు ఎలా సంపాదిస్తారు.. ఇలా అన్ని విషయాల గురించి దీనిలో కళ్లకు కట్టినట్లు చూపిస్తారు.. అయితే.. అదే తరహాలో గతంలో ఎన్నో స్మగ్లింగ్ ఘటనలు చూసుంటాం.. ఎందుకంటే.. అడ్డదారులు తొక్కడానికి అరవై మార్గాలు అంటారు.. గంజాయి స్మగ్లర్లు కూడా అంతే.. పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ వర్గాల నిఘాకు చిక్కకుండా ఉండేందుకు పుష్ప సినిమా స్టైల్‌ను అనుసరిస్తున్నారు. ఎన్ని కఠిన ఆంక్షలు, చెకింగ్‌లు పెట్టినా గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతూనే ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కో రేంజ్‌లో తమ దొంగ తెలివితేటలను ప్రదర్శిస్తున్నారు. తాజాగా.. కొమురం భీమ్‌ జిల్లాలో పుష్ప మూవీని మించిన సీన్‌ వెలుగులోకి వచ్చింది.. ట్యాంకర్‌లో గంజాయి తరలిస్తూ డ్రైవర్‌ పట్టుబడ్డాడు..

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లావాంకిడి అంతర్ రాష్ట్రీయ చెక్ పోస్ట్ వైపు ఓ భారీ వాటర్ ట్యాంకర్ వచ్చింది.. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి ఆపి తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ట్యాంకర్ లో అసలు గుట్టు బయటపడింది. ట్యాంకర్లో భారీ మొత్తంలో తరలిస్తున్న గంజాయి పట్టుబడిందని పోలీసులు తెలిపారు.

వీడియో చూడండి..

సినీ ఫక్కీలో ట్యాంకర్‌లో గంజాయి స్మగ్లింగ్‌ చేస్తుండగా.. పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ట్యాంకర్‌ డ్రైవర్‌ను అరెస్ట్‌ చేసి.. విచారిస్తున్నామని.. దీని వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని వాంకిడి పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..