Bhadradri Kothagudem district: భద్రాద్రి జిల్లాలో గంజాయి కలకలం చెలరేగింది. బోల్తా పడిన కారులో భారీగా గంజాయి దొరికింది. ఒకటి, రెండు కాదు..390 కేజీల గంజాయి గుర్తించారు పోలీసులు. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బూర్గంపహడ్ మండలం సారపాకలోని భద్రాచలం బ్రిడ్జ్ సమీపంలో తెల్లవారుజామున 2 గంటల సమయంలో కారు బోల్తా పడింది. ఓవర్ స్పీడ్‌తో అదుపు తప్పి పల్టీలు కొట్టింది. బోల్తా పడిన కారులో భారీ మొత్తంలో గంజాయిని గుర్తించారు పోలీసులు. ఐతే ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్‌తో పాటు కారులోని వ్యక్తులు పరారయ్యారు. కారు రోడ్డుకు అడ్డంగా పడడంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడింది. కారును తొలగించిన పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. అసలు ఆ గంజాయి ఎక్కడి నుంచి వస్తోంది..? ఎక్కడికి తరలిస్తున్నారు. దీని వెనుక ఎవరున్నారు..? అన్న కోణంలో విచారిస్తున్నారు పోలీసులు. పరారీలో ఉన్న కారులోని వ్యక్తుల కోసం గాలిస్తున్నారు.
Also Read: AP – Telangana: డేంజర్‌లో ఏపీ, తెలంగాణ ప్రజలు.. భారత వాతావరణ శాఖ వార్నింగ్