Watch: రేయ్ ఇలా ఉన్నావేంట్రా.. గంజాయి మత్తులో రెచ్చిపోయిన యువకుడు.. షాకింగ్ వీడియో

హైదరాబాద్ పాతబస్తీలోని చాంద్రాయణగుట్టలో గంజాయి మత్తులో యువకుడు రెచ్చిపోయిన మరో ఘటన వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల క్రితం ASI పై జరిగిన దాడి మరువక ముందే మరో వ్యక్తి గంజాయి మత్తులో హల్చల్‌ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Watch: రేయ్ ఇలా ఉన్నావేంట్రా.. గంజాయి మత్తులో రెచ్చిపోయిన యువకుడు.. షాకింగ్ వీడియో
Viral Video (1)

Edited By: Anand T

Updated on: Oct 19, 2025 | 5:18 PM

నగరంలో రోజురోజుకూ మత్తు పదార్థాల వాడకం పెరిగిపోతుంది. రాష్ట్రంలోకి గంజాయి రాకుండా అడ్డుకునేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కొందరు కేటుగాళ్లు మాత్రం ఎలాగోలా వాటిని నగరంలోకి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. దీంతో యువత గంజాయికి బానిసలై జీవితాలను పాడు చేసుకుంటున్నారు. అర్థరాత్రి రోడ్లపైకి వచ్చి జనాలను భయాందోళనకు గురిచేస్తున్నారు. తాజాగా చాంద్రాయణగుట్టలో ఇలాంటి ఘటనే వెలుగు చూడగా వారిని అరెస్ట్ చేసి పోలీసులు బుద్ది చెప్పారు.

అయితే ఈ ఘటన జరిగి రెండ్రోజులు కూడా గడవక ముందే అదే ప్రాంతంలో మరో గంజాయి మత్తులో మరో యువకుడు హల్చల్‌ చేశాడు. పిలీ దర్గా రోడ్ ఆటో స్టాండ్ వద్ద గంజాయి సేవించిన ఆటో డ్రైవర్ నానా రచ్చ చేశాడు. రాత్రి సమయంలో పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తుండగా పట్టుబడిన ఆటో డ్రైవర్‌ పోలీసుల ముందే నానా హంగామా చేశాడు. పోలీసులు బ్రీత్‌ అనలైజర్‌తో టెస్ట్ చేయబోతే.. తన తలను ఆటో అద్దానికి బలంగా గుద్దకున్నాడు. ఆ యువకుడు ఇలా దాదాపు అరగంట సేపు పోలీసులకు చుక్కలు చూపించాడు. చివరకు యువకుడు గంజాయి సేవించినట్టు గుర్తించిన పోలీసులు.. అతనిపై డ్రండ్‌ డ్రై కింద కేసు నమోదు చేశారు. అతని ఆటోను కూడా సీజ్ చేశారు.

అయితే అక్కడే ఉన్న కొందరు వాహనదారులు ఈ తతంగాన్ని తమ సెల్‌ఫోన్‌లలో రికార్డ్ చేసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. వీడియోలో ఆ యువకుడు ప్రవర్తించిన తీరు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. ఈ వీడియో చూసిన చాలా మంది ఆటోలు ఎక్కలాంటేనే భయమేస్తుందనే కామెంట్స్ చేస్తున్నారు.

వీడియో చూడండి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.