Telangana: ఓ ఫ్లాట్‌లో అనుమానాస్పదంగా ముగ్గురు వ్యక్తులు.. తరచూ సీక్రెట్‌గా మంతనాలు.. పోలీసుల ఎంట్రీతో.!

డెఫ్ తయారీలో రాజస్థానికి చెందిన ఓ వ్యక్తి ద్వారా చత్తీస్‌ఘడ్‌లో ట్రైనింగ్ తీసుకున్నాడు. వెలిమినేడులోని తన దాబా పక్కన ఉన్న టేకుల అంజిరెడ్డికి చెందిన ప్లాట్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా డెఫ్ తయారీ కేంద్రాన్ని నాగదేవ్ శంకర్ యాదవ్ నిర్వహిస్తున్నారు.పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు.. శంకర్ యాదవ్ చీకటి వ్యాపారాన్ని బయటపెట్టారు.

Telangana: ఓ ఫ్లాట్‌లో అనుమానాస్పదంగా ముగ్గురు వ్యక్తులు.. తరచూ సీక్రెట్‌గా మంతనాలు.. పోలీసుల ఎంట్రీతో.!
Adulterated Diesel Exhaust Fluid Gang Arrest

Edited By: Balaraju Goud

Updated on: Aug 01, 2025 | 10:23 AM

కల్తీగాళ్ళు యూరియాతో కల్తీ పాలను తయారు చేయడం చూశాం.. విన్నాం. ఈ కేటుగాళ్లు మాత్రం యూరియాతో కల్తీ డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ డెఫ్‌ను తయారు చేయడం తెలుసా..? సబ్సిడీ యూరియాను పక్కదారి పట్టించి డెఫ్ తయారు చేస్తున్న ముఠా నల్లగొండ జిల్లా పోలీసులు పట్టుకున్నారు.

బీహార్ కు చెందిన నాగదేవ్ శంకర్ యాదవ్ ఉపాధి కోసం పదేళ్ల క్రితం నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి వలస వచ్చాడు. జాతీయ రహదారి పక్కన డాబా హోటల్‌ను నిర్వహిస్తున్నాడు. డాబా ఆదాయం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఈజీ మనీ కోసం పథకం వేశాడు. బీఎస్-6 వాహనాల్లో డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ డెఫ్ ను వినియోగిస్తారు. ఇండస్ట్రియల్ యూరియాతో ఈ డెఫ్ ను తయారు చేస్తారు. దీన్నే ఆసరాగా చేసుకుని చాటు బేరానికి తెర లేపాడు.

డెఫ్ తయారీలో రాజస్థానికి చెందిన ఓ వ్యక్తి ద్వారా చత్తీస్‌ఘడ్‌లో ట్రైనింగ్ తీసుకున్నాడు. వెలిమినేడులోని తన దాబా పక్కన ఉన్న టేకుల అంజిరెడ్డికి చెందిన ప్లాట్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా డెఫ్ తయారీ కేంద్రాన్ని నాగదేవ్ శంకర్ యాదవ్ నిర్వహిస్తున్నారు. డెఫ్ తయారీకి ఇండస్ట్రియల్ యూరియా బస్తాకు రూ.1,500 ధరకు కొనుగోలు చేసి వినియోగించాడు. దీంతో ఉత్పత్తి వ్యయం ఎక్కువ అవుతోంది. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకునేందుకు నాగదేవ్ శంకర్ యాదవ్ మరో పథకం వేశాడు.

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీ ద్వారా బస్తా రూ 300లకు అందిస్తున్న యూరియాను అడ్డదారిలో కొనుగోలు చేయాలని భావించాడు. ఇందుకోసం వెలిమినేడు గ్రామానికి చెందిన శంకరయ్యతో కలిసి ప్రాథమిక సహకార సంఘంలో పనిచేస్తున్న దుర్గయ్యకు సబ్సిడీ యూరియా ఇస్తే బస్తాకు రూ. 30 రూపాయల కమిషన్ ఇస్తామని ఆశ చూపారు. వెలిమినేడు ప్రాథమిక సహకార సంఘం నుండి అక్రమంగా యూరియాను తీసుకువచ్చి డెఫ్ వినియోగిస్తున్నారు. వెలిమినేడుతో పాటుగా చిట్యాల, గుండ్రాంపల్లి, చౌటుప్పల్ పీఏసీఎస్ నుంచి కూడా తక్కువ ధరకు తీసుకువచ్చి డెఫ్ తయారు చేసి ఈ ముఠా సొమ్ము చేసుకుంటుంది.

రైతులకు యూరియా అందుబాటులో లేకుండా కృత్రిమ కొరత సృష్టిస్తూ అక్రమాలకు పాల్పడిన ఈ ముఠాపై వ్యవసాయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తయారీ కేంద్రంపై దాడి చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన 130 బస్తాల రాయితీ యూరియా, వాహనం, ఆటో, డెఫ్ ఉత్పత్తి చేసే యంత్ర పరికరాలు, వెయ్యి లీటర్ల సామర్థ్యం కలిగిన 16 ప్లాస్టిక్ డ్రమ్ములను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు చెందిన నాగదేవ్ శంకర్ యాదవ్, వెలిమినేడుకు చెందిన గోలి శంకరయ్య, మేడగోని దుర్గయ్యలతో పాటు వారికి సహకరించిన వినోద్ కుమార్, రాజీవ్ రాయ్, రోషన్ కుమార్ లను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శివరామ్‌రెడ్డి తెలిపారు.

వీడియో చూడండి.. 

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..