Ganesh Chaturthi 2022: మట్టి గణపతే మహా గణపతి.. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో ఉచిత పంపిణీ.. వివరాలివే..

| Edited By: Anil kumar poka

Sep 19, 2022 | 1:33 PM

Ganesh Chaturthi 2022: పట్టణీకరణలో ఆందోళన కలిగిస్తున్న అతిపెద్ద అంశం కాలుష్యం. అలాంటి కాలుష్య కారకాలు అనేక రకాలుగా నగర జీవనంపై దాడి చేస్తున్నాయి.

Ganesh Chaturthi 2022: మట్టి గణపతే మహా గణపతి.. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో ఉచిత పంపిణీ.. వివరాలివే..
Ganesh
Follow us on

Ganesh Chaturthi 2022: పట్టణీకరణలో ఆందోళన కలిగిస్తున్న అతిపెద్ద అంశం కాలుష్యం. అలాంటి కాలుష్య కారకాలు అనేక రకాలుగా నగర జీవనంపై దాడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ సమతుల్యతకు రాష్ట్ర ప్రభుత్వం హరితహారం నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ వరకు అనేక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా అత్యంత ప్రసిద్ధమైన గణేష్ నవరాత్రి ఉత్సవాలను పర్యావరణహితంగా జరిపేందుకు గ్రీన్ గణేశా.. ఎకో గణేశా అంటూ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చూట్టుంది. ఇందుకు భాగ్యనగరం ప్రధాన వేదికగా మారింది.

గతేడాది మాదిరిగానే ఈ ఏటా భాగ్యనగరంలో ఎకో ఫ్రెండ్లీ గణేశ్ అంటూ మట్టి విగ్రహాల పంపిణీని హెచ్ఎండీఏ ప్రారంభించింది. 2017 నుంచి ఎకో ఫ్రెండ్లీ గణేశ్ అంటూ ప్రమోట్ చేస్తున్న హెచ్ఎండీఏ.. ఏటా మట్టి విగ్రహాల సంఖ్యను పెంచుతూ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. నగర ప్రజలకు ఉచితంగా కావాల్సిన వారికి గతేడాది 70 వేల విగ్రహాలను డోర్ డెలివరీ చేసింది. ఈ ఏడాది నగరంలో 41 ప్రాంతాల్లో సెంటర్లు పెట్టి లక్ష విగ్రహాలను పంపిణీ చేస్తోంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేసిన హెచ్ఎండీఏ శనివారం(27వ తేదీ నుంచి) నుంచి 30వ తేదీ వరకు ఆయా ప్రాంతాల్లో విగ్రహాలను కావాల్సిన వారికి ఉచితంగా అందించనుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తే కాలుష్యం ఏర్పడుతుందని.. విగ్రహాల నిమజ్జనంపై గతంలో కోర్టు ఆంక్షలు కూడా ఉండటంతో ఈ ఏడాది మట్టి గణపతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. విడివిడిగా లేదా కమ్యూనిటీగా, ఎన్జీవోలు వచ్చిన వారికి ఉచితంగా మట్టి విగ్రహాలను అందిస్తామని స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ తెలిపారు.

మట్టి విగ్రహాలు పంపిణీ చేయనున్న ప్రాంతాలు, ఆయా సంబంధిత అధికారుల జాబితాను హెచ్ఎండీఏ విడుదల చేసింది.

ఇవి కూడా చదవండి

1. ఆరోగ్య శ్రీ ఆఫీస్, బంజారాహిల్స్

2. ఐఏఎస్ క్వార్టర్స్, బంజార్ హిల్స్

3. కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్

4. గ్రీన్ లాండ్స్

5. రోడ్ నెం.1 వెంకటేశ్వర స్వామి ఆలయం బంజారాహిల్స్

6. ప్రెస్ క్లబ్ హైదరాబాద్

7. ప్రెస్ అకాడమీ హైదరాబాద్

8. రాజపుష్ప, 7 హిల్స్ నార్సింగ్

9. గచ్చిబౌలి టోల్ బూత్

10. డిల్లీ పబ్లిక్ స్కూల్ అపార్ట్ మెంట్

11. బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయం

12. రోడ్ నెం.36 రత్నదీప్ సూపర్ మార్కెట్ జూబ్లీహిల్స్

13. టూప్స్ రెస్టారెంట్ జూబ్లీ హిల్స్

14. పెద్దమ్మ టెంపుల్ జూబ్లీ హిల్స్

15. స్టార్ బక్ రోడ్ నెం.92 జూబ్లీ హిల్స్

16. మై హోం భూజ, మాదాపూర్

17. శిల్పారామం, హైటెక్ సిటీ

18. ఉప్పల్ మినీ శిల్పారామం

19. కూకట్ పల్లి మెట్రో క్యాష్ అండ్ క్యారీ

20. హెచ్ఎండీఏ ఆఫీస్ మైత్రివనం, అమీర్ పేట్

21. నెక్లెస్ రోడ్ రోటరీ

22. ట్యాంక్ బండ్

23. బీఆర్ కే భవన్

24. ఎన్టీఆర్ గార్డెన్

25. ప్రియదర్శిని పార్క్ సరూర్ నగర్

26. రాజీవ్ గాంధీ పార్క్, వనస్థలిపురం

27. కుందన్ బాగ్, బేగం పేట్

28. దుర్గం చెరువు

29. నారాయణగూడ పార్క్

30. భారతీయ విద్యాభవన్, సైనికపురి

31. వాయుపురి

32. ఆరాంఘర్ జంక్షన్

33. నెక్నాంపూర్

34. మైండ్ స్పేస్ జంక్షన్ మాదాపూర్

35. మైహోం నవదీప, మాదాపూర్

36. మియాపూర్, కూకట్ ప్రాంతాల్లో వాహనాల్లో మోబైల్ డిస్ట్రిబ్యూషన్

37. రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోషియేషన్

38. కొటక్ మహింద్రా బ్యాంక్

39. పెద్ద అంబర్ పేట్ నగర పంచాయతీ

40. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్

41. HGCL ఆఫీస్

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..