
ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన నిఘా ఉన్న నగరాల్లో ఒకటి.. గ్రేటర్ హైదరాబాద్. నో డౌట్.. పక్కా సేఫ్ సిటీ. వన్ మిలియన్.. అంటే 10 లక్షల సీసీటీవీ కెమెరాలు ఉన్నాయంటే నాట్ ఏ జోక్. భద్రతలో దేశంలోనే సెకండ్ ప్లేస్.. భాగ్యనగరానిది. వరల్డ్‌వైడ్ టాప్-50 సిటీస్‌లోనూ హైదరాబాద్‌కి ప్లేస్ దక్కింది. ప్రతి వెయ్యి మందికి 35 సీసీ కెమెరాలు ఉన్నట్టు లెక్క. దీనికితోడు పోలీసుల బందోబస్తు, పెట్రోలింగ్ వెహికల్స్, డేగకళ్ల లాంటి ఇంటెలిజెన్స్.. ఇదీ హైదరాబాద్ రేంజ్. బట్.. మొన్నామధ్య సైనైడ్ కంటే డేంజర్ అయిన రైసిన్‌తో గుజరాత్‌లో పట్టుబడ్డాడొక ఉగ్రవాది. అతడి పర్మినెంట్ అడ్రస్.. హైదరాబాద్. 2017లో ముగ్గురు కుర్రాళ్లు కశ్మీర్ వెళ్లారు. అనుమానమొచ్చి ఆరా తీస్తే ఐసిస్‌లో చేరడానికి వెళ్తున్నారని తేలింది. ఆ ముగ్గురి కేరాఫ్.. హైదరాబాద్. 2022 దసరా పండగప్పుడు దేశవ్యాప్తంగా ఓ అలర్ట్ వచ్చింది. ఎక్కడో గట్టి ఉగ్రదాడే జరగబోతోందని. అనుమానం వచ్చి ఓ ఇంట్లో చెక్ చేస్తే.. గ్రెనేడ్లు దొరికాయ్. ఎక్కడో కాదది… హైదరాబాద్‌లోనే. అవి చైనాలో తయారై పాకిస్తాన్ వెళ్లి అక్కడి నుంచి సిటీకొచ్చాయ్. బిహార్ దర్భంగా రైల్వే ఫ్లాట్‌ఫామ్‌పై మూడేళ్ల క్రితం బాంబ్ బ్లాస్ట్ జరిగింది గుర్తుందా? బాంబును పార్శిల్ చేసి రైల్లో పంపారు. అదృష్టం.. రైల్లో పేలలేదు. ఇంతకీ ఆ పార్శిల్ ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచే. చివరికి.. అక్కడెక్కడో ఆస్ట్రేలియాలో టెర్రర్ అటాక్ జరిగినా.. ఆ ఉగ్రవాది అడుగులు సైతం...