BRS party rift: తిరగబడ్డ బిడ్డ.. కుటుంబంలో కల్లోలం.. పార్టీలో సంక్షోభం…
కేసీఆర్ చుట్టూ కొన్ని దెయ్యాలున్నాయ్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ పెట్టారు తప్ప జవాబులు ఇవ్వలేదు ఇప్పటి దాకా? ఉన్నట్టుండి ఇద్దరి పేర్లను నేరుగా ప్రస్తావించారు కవిత. కేసీఆర్‌కు అవినీతి మరక అంటడానికి కారణం హరీష్‌రావు, సంతోష్‌రావే అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఆనాడు మిగిల్చిన ప్రశ్నలకు, ఈనాడు చేసిన వ్యాఖ్యలతో పోల్చుకుని తెలంగాణ ప్రజలే సమాధానాలు రాసేసుకుంటున్నారా? ఆ అవకాశం కవితనే ఇచ్చారా? కొన్నాళ్లుగా.. పార్టీలో తన స్థానంపైనా, కేసీఆర్‌ను రాంగ్ డైరెక్షన్‌లో నడిపిస్తున్నారనే అంశంపైనా పరోక్షంగా మాట్లాడుతూ వచ్చారు కవిత. ఇప్పుడిక దాపరికాల్లేవ్. నేరుగానే హరీష్‌రావు, సంతోష్‌రావును టార్గెట్ చేశారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కవిత తన కామెంట్స్‌తో కన్ఫామ్ చేసినట్టైంది. హరీష్‌రావును ఇరిగేషన్ మంత్రి నుంచి పక్కనపెట్టారని చెప్పడం.. అవినీతి జరిగిందని సర్టిఫికేట్ ఇవ్వడం కాదా? సో, ఇకపై ఏం జరగబోతోంది? ఇన్నాళ్లూ కవిత చేస్తున్న కామెంట్స్‌ను పట్టించుకోవద్దన్న అధిష్టానం ఆదేశాల నుంచి.. ఇక చర్య తీసుకోక తప్పదు అనే అనివార్య పరిస్థితి కల్పించినట్టేనా? అసలే సీబీఐ ఎంక్వైరీతో డిఫెన్స్‌లో పడిన పార్టీని.. కవిత మరింత డిఫెన్స్‌లోకి నెట్టేశారా? కంప్లీట్ అనాలసిస్...

కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ అవినీతి చేశారని కాంగ్రెస్ యాగీ చేస్తున్నప్పుడూ ఇంత రియాక్షన్ ఇవ్వలేదు. కేసీఆరే లక్ష్యంగా కమిషన్‌ను నియమించినప్పుడూ ఇంత ఫైర్ అవలేదు. రిపోర్ట్ బయటికొచ్చాక సైతం ఈస్థాయిలో ఆగ్రహజ్వాల బయటపడలేదు. కేసీఆర్‌ను కమిషన్ ముందుకు రప్పించినప్పుడూ ఒక్కమాట మాట్లాడలేదు. ఉన్నట్టుండి ఏంటీ బ్లాస్టింగ్? తన తండ్రిపై సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించారన్న ఆగ్రహమా? తనపైనా ఇవే తరహా కుట్రలు చేశారన్న బాధనా? జాగ్రత్తగా గమనిస్తే.. కవిత పార్టీ తరపున మాట్లాడినట్టుగా లేదు. పార్టీతో తాడోపేడో తేల్చుకోవాలన్నట్టుంది. దీనికి కాస్త సెంటిమెంట్ రగిలిస్తూ.. తండ్రిపై సీబీఐ విచారణకు ఆదేశించారన్న భావోద్వేగమూ కనిపించింది. లేకపోతే.. పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అని అనడంతోనే.. కవిత ఎంతకైనా తెగించినట్టు అర్థమైపోతోంది. కేసీఆర్ అనుంగ సహచరుడుగా, దశాబ్దాలుగా కేసీఆర్‌తో పాటే నడుస్తున్న సంతోష్‌రావు మీద.. కేసీఆర్ రాజకీయ చరిత్రలో, కేసీఆర్ వ్యవహారాల్లో కీలక భూమిక పోషిస్తున్న హరీష్‌రావు మీద అత్యంత తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు కవిత. ఆరోపణలు చేయడం కాదు.. నేరుగా పార్టీలో చిచ్చుపెట్టారు కూడా. హరీష్‌రావు, సంతోష్‌రావు పేర్లను చాలా గట్టిగా ప్రస్తావించిన కవిత.. కేటీఆర్ విషయంలోనే ఇంకా మౌనంగా ఉన్నారనుకోండి, అది వేరే విషయం. కవిత స్టేట్‌మెంట్స్ ఎలా ఉన్నాయంటే.. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అప్పటి ఇరిగేషన్ మినిస్టర్‌గా ఉన్న హరీష్‌రావు అవినీతి చేశారని కవిత నేరుగా, బహిరంగంగా చెప్పినట్టే. కవిత చేసన ఈ కామెంట్లతో.. ఇన్నాళ్లుగా కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు కవిత బలం...




