Telangana: ట్రావెల్‌ ఫ్రీ..! ఆడపిల్ల పుడితే 6 నెలలు, గర్భిణులు, బాలింతలకు.. ఆటోవాలా గొప్ప మనసుకు హ్యాట్సాఫ్‌..

|

Sep 07, 2022 | 8:41 AM

పట్టణ పరిధిలో గర్భిణులు, బాలింతల కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే చాలు... రాత్రి పగలు అనే తేడా లేకుండా..వారున్న చోటుకి వెళ్లి మరీ ఆస్పత్రికి తరలిస్తాడు. తిరిగి ఇంటికి చేరుస్తాడు.

Telangana: ట్రావెల్‌ ఫ్రీ..! ఆడపిల్ల పుడితే 6 నెలలు, గర్భిణులు, బాలింతలకు.. ఆటోవాలా గొప్ప మనసుకు హ్యాట్సాఫ్‌..
Free Travel
Follow us on

Telangana: కుటుంబ పోషణలో పూట గడవడం కష్టంగా ఉన్న ఓ యువకుడు తన సేవా నీరతిని చాటుకుంటున్నాడు. రోజు రోజుకు పెట్రోల్, డిజీల్ ధరలు పెరుగుతుండగా.. అదే రీతిలో రవాణా చార్జీలు సైతం పెరిగిపోతున్నాయి. దీంతో ప్రస్తుత రోజుల్లో గర్భిణులు, బాలింతలకు ఉచిత ట్రావెల్ సౌకర్యం కల్పిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన కాం బ్లే సాహెబ్రావు అనే యువకుడు. భైంసా పట్టణ పరిధిలో గర్భిణులు, బాలింతల కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే చాలు… రాత్రి పగలు అనే తేడా లేకుండా..వారున్న చోటుకి వెళ్లి మరీ ఆస్పత్రికి తరలిస్తాడు. తిరిగి ఇంటికి చేరుస్తాడు. అన్ని ధరలు మండిపోతున్న ఇలాంటి టైమ్‌లో అతడు ఇవన్నీ చేస్తున్నాడనేది ఇక్కడ తెలుసుకుందాం..

భైంసా పట్టణంలోని పిప్రికాలనీకి చెందిన కాం బ్లే నాగమణి–రాం దాస్ దంపతుల పెద్ద కుమారుడు సాహెబ్రావు..ఇతడు ఇంటర్ పూర్తి చేసి ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఏడాది క్రితం తన ఫ్రెండ్ భార్యకు కూతురు పుట్టింది..కానీ, అనారోగ్యంతో బాధపడుతున్న ఆ చిన్నారిని సకాలంలో ఆస్పత్రిలో చేర్పించలేకపోవటంతో ఆ పసికందు చనిపోయిందట. జరిగిన సంఘటన సాహెబ్రావ్‌ని కలచివేసింది. తీవ్ర మనోవేదనకు గురైన అతడు..ఇలాంటి కష్టం మరెవరికీ రాకూడదనే ఉద్దేశ్యంతో తన వంతు సాయం చేసే ప్రయత్నం మొదలుపెట్టాడు. ఆటోలో గర్భి ణీలు, బాలింతలను ఉచిత ప్రయాణం అందిస్తున్నాడు. ఏడు నెలలు నిండిన గర్భిణుల నుండి ప్రసవం అయ్యే వరకు ఉచితంగా తన ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్తున్నా డు. డెలీవరి అయ్యాక.. ఆడపిల్ల పుడితే ఆరు నెలల పాటు బాలింతలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాడు.

కాం బ్లే సాహెబ్రావుది నిరుపేద కుటుంబం. ఆయన తమ్ము డు చదువుకోలేక ఊర్లో కూలీ పనులు చేస్తుంటాడు. ఆర్థిక పరిస్థితులు కూడా బాగోలేక చెల్లి సైతం చదువు మానేసి ఇంటికే పరిమితమైంది. తాపీ పని చేసే తండ్రి కాం బ్లే రాం దాస్ వయసు పైబడటంతో పనికి దూరమయ్యాడు. తల్లి నాగమణి బీడీలు చూడుతుంది. ఇంతటి పేదరికంలోనూ సాహెబ్రావు అందిస్తున్న సేవలు అభినందనీయం.ఆడ పిల్లలు భారం అనుకోవద్దు.. మహిళను గౌరవించాలని చెబుతున్నా డు. ఆటో వాలాలు మంచి వారని, అందరిలోనూ సేవా భావం పెంపోందించాలనే తన ప్రయత్నమంటున్నాడు సాహెబ్రావు. ఏది ఏమైనప్పటికీ..సాహెబ్రావు అందిస్తున్న ఫ్రీ సర్వీస్‌కు హ్యాట్సా ప్ చెప్పా ల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి