AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yadadri: యాదాద్రీశుడిని దర్శించుకున్న ముగ్గురు సీఎంలు.. లక్ష్మీనరసింహ స్వామికి ప్రత్యేక పూజలు..

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోని ముఖ్యమంత్రులు, అగ్ర నేతలు యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌తో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్,

Yadadri: యాదాద్రీశుడిని దర్శించుకున్న ముగ్గురు సీఎంలు..  లక్ష్మీనరసింహ స్వామికి ప్రత్యేక పూజలు..
Cm Kcr And Arvind Kejriwal
Shiva Prajapati
|

Updated on: Jan 18, 2023 | 12:13 PM

Share

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోని ముఖ్యమంత్రులు, అగ్ర నేతలు యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌తో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగ్వంత్ సింగ్ మాన్ , యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కవిత ఉన్నారు.

ప్రముఖుల రాక సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు.

అయితే, సీఎం కేసీఆర్‌తోపాటే యాదాద్రికి వచ్చినా కేరళ సీఎం స్వామివారి దర్శనానికి వెళ్లలేదు. ఆయనతోపాటు సీపీఐ జాతీయ నేత రాజా కూడా ప్రెసిడెన్షియల్‌ సూట్‌లోనే ఉండిపోయారు. కాసేపట్లో మిగతావాళ్ల పూజలు పూర్తయ్యాక.. అంతా కలిసి ఖమ్మం వెళ్తారు. నలుగురు సీఎంలతో పాటు కీలక నేతల టూర్‌ నేపథ్యంలో యాదగిరి గుట్టలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి స్వామివారి దర్శనాలు నిలిపివేశారు. అర్జిత సేవలు కూడా నిలిపివేశారు.

ఇవి కూడా చదవండి

ఇక యాదాద్రి ఆలయ పునర్‌నిర్మాణం విశిష్టతల్ని అతిథులకు వివరించారు సీఎం కేసీఆర్‌. ప్రత్యేక పూజల అనంతరం ఖమ్మం చేరుకుని కంటివెలుగు కార్యక్రమంలో పాల్గొంటారు సీఎం కేసీఆర్.

సీఎం కేసీఆర్ పర్యటన, బీఆర్ఎస్ ఖమ్మం మీటింగ్ లైవ్..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..