ఒక వైపు భారీ వర్షం.. మరోవైపు.. దోమల సమస్యల వీటన్నింటికి తోడు నాలుగు గంటలకు పైగా ఆ ప్రాంతంలో కరెంట్ లేకపోవడం.. వీటన్నింటితో కలిసి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణలోని పలు ప్రాంతాల్లో రాత్రి 8.15 గంటల నుంచి 12.05 వరకు దాదాపు నాలుగు గంటలు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అర్దరాత్రి ఒక వైపు వర్షం కురుస్తుండడంతో.. కరెంట్ కట్ ఎందుకు జరిగిందనే విషయం తెలుసుకోవడానికి అక్కడి విద్యుత్ శాఖ సిబ్బంది ప్రయత్నాలు ప్రారంభించారు. విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అక్కడి ప్రాంతాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్స్, స్తంభాలు అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి.. అసలు విషయం తెలుసుకుని తలపట్టుకున్నారు.
విద్యుత్ సిబ్బంది కలిసి అదే రాత్రి.. విద్యుత్ సరఫరా అంతరాయంకు గల కారణాలు తెలుసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. సబ్ స్టేషన్లో ఎలాంటి సమస్య లేకపోవడంతో.. ఏఈ, లైన్ ఇన్స్పెక్టర్, సబ్ ఇంజనీర్, ఇతర సిబ్బంది సబ్ స్టేషన్ నుంచి రైల్వే ట్రాక్ వరకు 11 కేవీ లైన్ కు సంబంధించి సుమారు 30 స్తంభాల పైకి ఎక్కి పరిశీలించారు. చివరకు రైల్వే ట్రాక్ సమీప స్తంభంపైన ఉన్న కండక్టర్ ఇన్సులేటర్ మీద తొండపడి చనిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినట్లుగా గుర్తించారు. ఇంకేముందు వెంటనే ఆ తొండను తొలగించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
Horoscope Today: ఈ రాశులవారు ఆరోగ్యం.. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.. ఈరోజు రాశిఫలాలు..