KTR: ప్రజా దర్బార్‎లో దరఖాస్తు చేసుకున్న అన్నపూర్ణకు ఆర్థికసాయం చేసిన కేటీఆర్..

| Edited By: Ravi Kiran

Dec 25, 2023 | 7:25 AM

ప్రజల కష్ట సుఖాలు వింటాము, అండగా నిలబడతామంటూ అధికారంలోకి వచ్చిన వారం రోజుల పాటు హడావిడి చేసిన ప్రజాదర్బార్ కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమైనట్లు కనిపిస్తుంది. ఇల్లందు పట్టణం ఆజాద్ నగర్‎కి చెందిన అన్నపూర్ణ వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి హైదరాబాద్‎కి వచ్చారు.

KTR: ప్రజా దర్బార్‎లో దరఖాస్తు చేసుకున్న అన్నపూర్ణకు ఆర్థికసాయం చేసిన కేటీఆర్..
Former Minister Ktr
Follow us on

తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజలు చేరువ అయ్యేలా ‘ప్రజా దర్బార్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రం నలమూలల నుంచి ప్రజలు ఈ  ప్రజా దర్బార్‌కు తరలి వచ్చి.. తమ సమస్యల గోడు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే అన్నపూర్ణ అనే మహిళ ప్రజా దర్బార్‌కు వచ్చి తన సమస్య చెప్పుకోగా.. అక్కడ పరిష్కారం కాకపోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌ను కలిశారు సదరు మహిళ. కేటీఆర్‎ని కలిసిన వెంటనే ఆయన ఆమె బాధ విని తన వ్యక్తిగత స్థాయిలో లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారని అన్నపూర్ణ సంతోషం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న లేకున్నా ప్రజల కష్టసుఖాలు వినడానికి.. సాధ్యమైనంత వరకు సాయం చేయడానికి ముందుకు వచ్చిన కేటీఆర్‎కి అన్నపూర్ణ ధన్యవాదాలు తెలిపారు. అన్నపూర్ణ బాధలు విన్న తర్వాత, ఆమె కూతురు నర్సింగ్ చదువు కోసం లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని కేటీఆర్ అందించారు. బంజారా హిల్స్‎లో ఉన్న తన ఇంటికి పలిపించుకుని మరీ చెక్కు అందించారు. తన కూతురు విద్య కోసం, కుటుంబ ఆర్థిక సహాయం కోసం సహకారం అందించిన కేటీఆర్ రుణపడి ఉంటానన్నారు అన్నపూర్ణ.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..