Power War: ఫారెస్ట్‌ వర్సెస్‌ ఎలక్ట్రిసిటీ.. రెండు ప్రభుత్వ విభాగల మధ్య వార్.. చీకట్లో గ్రామాలు..

.ఒకరిపై మరొకరు ప్రతీకార చర్యలు..నువ్వా..? నేనా..? అంటూ కొట్లాడుకుంటున్నారు ఈ రెండు శాఖల అధికారులు. ఢీ అంటే ఢీ అంటున్నారు. ఫలితంగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Power War: ఫారెస్ట్‌ వర్సెస్‌ ఎలక్ట్రిసిటీ.. రెండు ప్రభుత్వ విభాగల మధ్య వార్.. చీకట్లో గ్రామాలు..
Forest Officials File Case
Follow us

|

Updated on: Aug 10, 2021 | 9:33 AM

ఫారెస్ట్‌ వర్సెస్‌ ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్స్‌..ఒకరిపై మరొకరు ప్రతీకార చర్యలు..నువ్వా..? నేనా..? అంటూ కొట్లాడుకుంటున్నారు. ఈ రెండు శాఖల అధికారులు ఢీ అంటే ఢీ అంటున్నారు. ఫలితంగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రంతా కరెంట్‌ లేక నానా అవస్థలు పడ్డారు. మహబూబాబాద్‌ జిల్లాలో అలుముకున్న చీకట్లు..ఎస్‌..ఫారెస్ట్‌ అండ్‌ ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్స్‌ మధ్య వార్‌..ఒకరిపై మరొకరు ప్రతీకార చర్యలు..నువ్వా..? నేనా..? అంటూ కొట్లాడుకుంటున్నారు ఈ రెండు శాఖల అధికారులు. ఢీ అంటే ఢీ అంటున్నారు. ఫలితంగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రంతా కరెంట్‌ లేక నానా అవస్థలు పడ్డారు.

మహబూబాబాద్‌ జిల్లాలో విద్యుత్‌ అండ్‌ ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ మధ్య వార్‌ మరింత ముదిరింది. కేసుల వరకు వెళ్లింది. కొత్తగూడ మండలంలో తమ అనుమతి లేకుండా విద్యుత్‌ సరఫరా కోసం చెట్టు నరికేశారని ముగ్గురు విద్యుత్‌ ఖాఖాధికారులపై కేసులు పెట్టారు అటవీశాఖ సిబ్బంది. వారిని కోర్టులో హాజరుపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఐతే మాపై అక్రమ కేసులు పెడతారా..? మీకు ఏమాత్రం తీసిపోమన్నట్లుగా ప్రతీకార చర్యలకు దిగారు విద్యుత్‌ అధికారులు. కొత్తగూడ మండల కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయానికి, సిబ్బంది క్వార్టర్స్‌కు కరెంట్‌ సరఫరా నిలిపివేశారు. దీంతో రాత్రంతా అంధకారంలో ఉన్నాయి అటవీశాఖ కార్యాలయం, సిబ్బంది క్వార్టర్స్‌. వృత్తిధర్మాన్ని నిర్వరిస్తున్న తమపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదని అల్టిమేటం జారీ చేశారు విద్యుత్ శాఖాధికారులు. ఈ రెండు శాఖల మధ్య వార్‌తో..కొత్తగూడ-గంగారం మండలాల్లోని పలు గ్రామాల్లో విద్యుత్‌ సేవలకు అంతరాయమేర్పడింది.

మరోవైపు ఇవాళ్లి నుంచి కొత్తగూడ, గంగారం మండలాల్లో విద్యుత్ ఉద్యోగుల పెన్‌డౌన్ చేస్తున్నారు.పెన్‌డౌన్‌తో రెండు మండలాలకు నిలిచిన విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. సమస్య తీరకుంటే సామాన్య జనం చీకటిలోనే ఉండాల్సిందేనా.. ఈ సమస్యలకు ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూద్దాం..

ఇవి కూడా చదవండి:  Simple Cooking Tips: మీకు స్టిక్కీ రైస్‌ను వండటం ఎలానో తెలుసా.. ఈ వంటను చాలా రుచిగా తయారు చేయాలంటే ఇలా చేయండి…

ఇవి కూడా చదవండి : Nakli Paneer: మీరు తింటున్న పన్నీరు నకిలీ కావచ్చు..ఇంటికి తీసుకువచ్చిన వెంటనే నిజమైనదాన్ని ఇలా గుర్తించండి

YS Sharmila: ఇవాళ హుజూరాబాద్‌ నియోజకవర్గంలో షర్మిల దీక్ష.. పోటీపై కీలక ప్రకటనకు ఛాన్స్..