
జోగులాంబ గద్వాల జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. ఇటిక్యాల మండలం ధర్మవరంలోని బీసీ బాలుర వసతి గృహంలోని రాత్రి భోజనం వికటించి 50 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం చేసిన తర్వాత సుమారు 30 మందికిపైగా విద్యార్థులకు వాంతులు చేసుకున్నారు. మరికొందరు విద్యార్థులు కడుపునొప్పితో బాధపడ్డారు.గమనించిన హాస్టల్ సిబ్బంది వెంటనే హాస్టల్ వార్డెన్‌కు సమాచారం ఇచ్చారు.
హాస్టల్ వార్డెన్ 108 అంబులెన్స్ సహాయంతో విద్యార్థులను వెంటనే గద్వాల ప్రభుత్వ హాస్పిల్‌లకు తరలించారు. అక్కడ విద్యార్థులను పరీక్షించిన వైద్యులు వెంటనే వారికి చికిత్స అందించారు. ప్రస్తుతం విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేదని.. అందరూ సురక్షితంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
ప్రభుత్వ హాస్టల్స్‌లో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదు.. గతంలోనూ ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. వీటిపై ఉన్నతాధికారులు, ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. హస్టల్ సిబ్బందితో మాత్రం ఎలాంటి మార్పు రావట్లేదు. దీంతో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.