Telangana: కారులో దర్జాగా వచ్చి ఇతగాడు ఏం దొంగతనం చేశాడో తెలిస్తే కంగుతింటారు

ఎక్కడైనా చోరీ జరిగిందంటే ఆ ఇంట్లో బంగారం ఎంత పోయింది..? నగదు ఎంత పోయిందని అడుగుతుంటారు..? కానీ ఇక్కడ మాత్రం ఎన్ని పూలు పోయాయి..?

Telangana: కారులో దర్జాగా వచ్చి ఇతగాడు ఏం దొంగతనం చేశాడో తెలిస్తే కంగుతింటారు
Flower Pots Thief

Updated on: Dec 24, 2021 | 3:30 PM

ఎక్కడైనా చోరీ జరిగిందంటే ఆ ఇంట్లో బంగారం ఎంత పోయింది..? నగదు ఎంత పోయిందని అడుగుతుంటారు..? కానీ ఇక్కడ మాత్రం ఎన్ని పూలు పోయాయి.. ఎన్ని పూల కుండీలు పోయాయి అని అడగాలి.. ఇదేంటి వింతగా ఉందని అనుకుంటున్నారా…? ఈ పూల కుండీల దొంగ మాత్రం దర్జాగా కారులో నడి రాత్రి వచ్చి కుండీలు ఎత్తుకెళ్తున్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా బీట్ బజార్‌లో జరిగింది. ఇంటి గోడ పైన ఉన్న పూల మొక్కల కుండీలు గత రెండు, మూడు రోజులుగా మాయమవుతున్నాయి. ఇదేంటని మరో రోజు ఆ స్థానంలో కొత్త కుండిలు పెట్టినా.. అవి కూడా మాయమవుతున్నాయి. అసలేందుకు ఇలా జరుగుతుందని అక్కడి సీసీ టీవీలో చూడగా ఓ పూల కుండిల దొంగ రాత్రి రెండు, మూడు గంటల సమయంలో వచ్చి కుండీలు ఎత్తుకెళ్లినట్లు అందులో రికార్డ్ అవడంతో ఇంటి యజమానులు కంగుతిన్నారు. వంద, రెండోందలకు వచ్చే పూల కుండిలను కారులో వచ్చి దొంగలించాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని తలలు పట్టుకున్నారు ఇంటి ఓనర్లు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

 

Also Read: ఇదెక్కడి మాస్‌రా మామ..! పుష్ప సాంగ్‌పై మీమ్ చూసి పిచ్చిపిచ్చిగా నవ్విన సమంత