Nirmal – Bhainsa – Floods : నిర్మల్‌జిల్లాను ఇంకా వరదలు బీభత్సం వెంటాడుతునే ఉంది. పలు గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. గూడెంగాం గ్రామస్తులు ఇంకా పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకున్నారు. మూడు రోజులుగా ముంపులోనే గూడెం గ్రామం ఉండటంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.
భైంసా ఎస్టీ హాస్టల్‌లో 110 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. అధికారులు తమకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ ఇవాళ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మరోవైపు నిర్మల్‌జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా ఇంకా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
మూడు రోజులుగా నీళ్లలోనే గుండెగాం గ్రామం మునిగి ఉంది. శాశ్వత పరిష్కారం చూపాలంటూ బైంసా డీఎస్పీ కార్యలయం దగ్గర ఆందోళనకు దిగారు గుండెగాం బాధితులు. ప్రస్తుతం బైంసా ఎస్సీ హాస్టల్‌లో 110 కుటుంబాలు తలదాచుకుంటున్నాయి. కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు చేరిన గుండెగాం ముంపు బాధితులు తమకు భరోసా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు.
తాజాగా లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్ గ్రామంలో గుండ్ల వెంకన్న అనే వ్యక్తి ఇల్లు కూలిపోయింది. అటు కొమురంభీమ్‌జిల్లా అందవెల్లిలో వరద ఉధృతికి పెద్దవాగు వంతెన కుంగిపోయింది. దాంతో వంతెనపై నుండి రాకపోకలను నిలిపివేశారు అధికారులు. మూడు మండలాలకు తాత్కాలికంగా రాకపోకలు నిలిచిపోయాయి.
భారీ వర్షాలకు గోదావరినది పరవళ్లు తొక్కుతోంది. మహారాష్ట్ర, కర్నాటకలో కురుస్తున్న వర్షాలకు గోదవరితోపాటు.. దాని ఉపనదులకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో బాసర టు ధవళేశ్వరం గోదారమ్మ పరవళ్లుతొక్కింది. ఎస్సారెస్పీ అన్ని గేట్లు ఎత్తి వరదనీటిని కిందకు వదులుతున్నారు.
Read also : Disha app : దిశ యాప్ : మహిళా రక్షణకు ఉక్కు కవచం, చెవిరెడ్డి పనితో సీఎం జగన్ ఫుల్ ఖుషి