Floating rock: హైదరాబాద్‌ నడిరోడ్డులో గాలిలో తేలియాడుతున్న రాళ్లు.. జంటనగరాల పుట్‌పాత్‌లపై కొత్త నగిషీలు

|

Jul 03, 2021 | 8:04 PM

ప్రధాన రహదారులతో పాటు పుట్‌పాత్‌లను అందమైన రంగులతో పాటు వివిధ ఆకృతులతో ఏర్పాటు చేసిన రూపాలు ఇట్టే నగరవాసులను ఆకట్టుకుంటున్నాయి.

Floating rock: హైదరాబాద్‌ నడిరోడ్డులో గాలిలో తేలియాడుతున్న రాళ్లు.. జంటనగరాల పుట్‌పాత్‌లపై కొత్త నగిషీలు
Floating Rock In Hyderabad
Follow us on

Floating rock in Hyderabad: విశ్వ నగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ మహానగరం అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతోంది. ప్రధాన రహదారులతో పాటు పుట్‌పాత్‌లను అందమైన రంగులతో పాటు వివిధ ఆకృతులతో ఏర్పాటు చేసిన రూపాలు ఇట్టే నగరవాసులను ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే మోజంజాహీ (ఎంజే) మార్కెట్ జంక్షన్ రోడ్ లో ఓ రాతి శిల్పం సరికొత్త అట్రాక్షన్‌గా నిలిచింది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే.. ఆ శిల్పం రెండు రాళ్లు గాలిలో తేలియాడుతున్నట్లుగా కనిపిస్తుంది. దీనిని అద్భతంగా చెక్కి తీర్చిదిద్దడంలో కళాకారుల నైపుణ్యం స్పష్టంగా కనిపిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు దీనిని ఏర్పాటు చేసి బాటసారులను ఆశ్చర్యపరుస్తోంది.

చాలా మందికి అసలు విషయం తెలియక కళ్లప్పగించి చూస్తున్నా.. ఎవరికీ అర్థం కావడం లేదు ఈ శిల్పం. విదేశాల్లో కనిపించే ఇలాంటి టెక్నిక్ హైదరాబాద్‌లో కూడా కనిపిస్తుండటం మరింత మందిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నిజానికి వాటిని అతికించరు. ఎటువంటి మాయాజాలం కూడా వాడలేదు అని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.

ఈ శిలలు గాల్లో తేలుతున్నట్లు ఉండటానికి సీక్రెట్..

హైదరాబాద్ మహానగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద ఎర్పాటు చేసిన శిల్పాలు అనుకున్నవాటి కంటే భిన్నంగా తయారు చేశారు. అవి ఫైబర్, గ్లాస్ మెటేరియల్ తో పాటు స్టీల్ పైప్ తో నిర్మించారు. అవి సపోర్టింగ్ నిలబడటంతో రెండు పెద్ద బండరాళ్లను గాల్లో తేలుతున్నట్లుగా కనిపిస్తుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేయడంతో అచ్ఛం బండరాళ్లలాగే కనిపిస్తున్నాయి. ఇదంతా డిజైనింగ్ లో ఉన్న టెక్నిక్సేనని ఈ మొత్తం రెడీ చేయడానికి దాదాపు 20రోజుల సమయం పట్టిందని జీహెచ్ఎంసీ అధికారులు చెప్పారు. ఎప్పుడూ బిజీగా ఉండే ఎమ్జే మార్కెట్ ప్రాంతంలో ఇది మరో అట్రాక్షన్ గా నిలిచింది.

Read Also…  భూమిపైకి పెద్ద పెద్ద గ్రహశకలాలు ఎన్ని వచ్చాయో తెలుసా?శాస్త్రవేత్తల కొత్త అధ్యయనంలో వెల్లడి..:asteroids on Earth video.