Hyderabad: రెస్టారెంట్‌లో ఎక్స్‌ట్రా పెరుగు అడిగి ప్రాణాలు పోగోట్టున్న యువకుడు.. ఐదుగురు అరెస్టు

చందాయణగుట్టకి చెందిన లియాకత్ అనే యువకుడు ఆదివారం రోజుల రాత్రి పూట పంజాగుట్టలో ఉన్న మెరిడియన్ హోట్‌ల్‌కి బిర్యానీ తినేందుకని వెళ్లాడు. ఇక లియాకత్ చెప్పిన ఆర్డర్ ప్రకారం.. సిబ్బంది బిర్యానీ తెచ్చి ఇచ్చారు. ఆ తర్వాత లికాయత్ ఎక్స్‌ట్రా పెరుగు తీసుకురావాలని రెస్టారెంట్ సిబ్బందిని అడిగాడు. కానీ అందుకు ఆ సిబ్బంది ఒప్పుకోలేదు. ఈ క్రమంలోనే హోటల్ సిబ్బందికి.. అలాగే లియాకత్ మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది.

Hyderabad: రెస్టారెంట్‌లో ఎక్స్‌ట్రా పెరుగు అడిగి ప్రాణాలు పోగోట్టున్న యువకుడు.. ఐదుగురు అరెస్టు
Arrest

Updated on: Sep 12, 2023 | 9:39 AM

హైదరాబాద్‌లోని పంజాగుట్టలో ఓ రెస్టారెంట్‌లో కస్టమర్ ఎక్స్‌ట్రా పెరుగు అడిగినందుకు.. రెస్టారెంట్ సిబ్బంది దాడి చేయడంతో ఆ కస్టమర్ మృతి చెందడం సంచలనం సృష్టించింన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుపై రంగంలోకి దిగిన పోలీసులు సోమవారం.. ఈ దాడికి పాల్పడిన ఐదుగురు రెస్టారెంట్ ఉద్యోగుల్ని అరెస్టు చేశారు. అలాగే ఈ ఘటనపై నిర్లక్ష్యం వహించిన ఇద్దరు పోలీసులకు కూడా సస్పెండ్ చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. పాతబస్తీ చందాయణగుట్టకి చెందిన లియాకత్ అనే యువకుడు ఆదివారం రోజుల రాత్రి పూట పంజాగుట్టలో ఉన్న మెరిడియన్ హోట్‌ల్‌కి బిర్యానీ తినేందుకని వెళ్లాడు. ఇక లియాకత్ చెప్పిన ఆర్డర్ ప్రకారం.. సిబ్బంది బిర్యానీ తెచ్చి ఇచ్చారు. ఆ తర్వాత లికాయత్ ఎక్స్‌ట్రా పెరుగు తీసుకురావాలని రెస్టారెంట్ సిబ్బందిని అడిగాడు. కానీ అందుకు ఆ సిబ్బంది ఒప్పుకోలేదు.

ఈ క్రమంలోనే హోటల్ సిబ్బందికి.. అలాగే లియాకత్ మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో మెరిడియన్ రెస్టారెంట్ సిబ్బంది.. లియాకత్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. సమాచారం తెలుసుకున్న పంజాగుట్ట పోలీసులు మెరిడియన్ హోటల్‌కు వచ్చారు. లియాకత్‌తో పాటుగానే మెరిడియన్ హోటల్ సిబ్బందిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే పోలీస్ స్టేషన్‌లో మాట్లాడుతుండగానే లియాకత్ ఉన్నట్లుండి ఒక్కసారిగా స్పహ తప్పి పడిపోయాడు. దీంతో ఇది గమనించిన పోలీసులు వెంటనే అతడ్ని సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కానీ లియకత్ చికిత్స పొందుతూ సోమవారం ఉదంయ మృతి చెందాడు. ఆ తర్వాత పోలీసులు అతని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఇక విషయం తెలుసుకున్న లియాకత్ కుటుంబ సభ్యులు డెక్కన్ ఆసుపత్రికి చేరుకున్నారు.

లియాకత్‌‌పై దాడి జరిగిన తర్వాత వెంటనే ఆసుపత్రికి తరలించకుండా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లడం వల్లే మృతి చెందాడని అతని కుటుంబీకులు ఆందోళనకు దిగారు. అలాగే ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్‌ బేగ్‌ పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని మృతి చెందిన లియాకత్‌ కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్‌ చేశారు. ఆ తర్వాత పోలీసులు మృతి చెందిన యువకుడి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తీసుకెళ్లారు. పోలీసులు ఈ ఘటనపై ఈ కేసు నమోదు చేసుకోని.. రెస్టారెంట్ సిబ్బందిని ప్రశ్నించారు. అయితే ఇప్పుడు తాజాగా ఐదుగురు రెస్టారెంట్ సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే లియకత్‌పై దాడి జరిగిన అనంతరం.. అక్కడికి వచ్చిన పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్లకుండా పోలీస్ స్టేషన్‌కు తీసుకురావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై నిర్లక్ష్య వహించినందుకు ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..