Telangana: ఓ కుటుంబాన్ని మింగేసిన రోడ్డు ప్రమాదం.. శుభకార్యక్రమానికి వెళ్లి తిరిగొస్తుండగా..

మరో 15 నిమిషాల్లో‌ గమ్యస్థానం చేరుతారనుకునే సమయంలో మృత్యువు కబలించింది. శుభకార్యానికి వెళ్లి, ఇంటికి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని మింగేసింది.

Telangana: ఓ కుటుంబాన్ని మింగేసిన రోడ్డు ప్రమాదం.. శుభకార్యక్రమానికి వెళ్లి తిరిగొస్తుండగా..
Five Family Members Died
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 01, 2024 | 12:24 PM

మరో 15 నిమిషాల్లో‌ గమ్యస్థానం చేరుతారనుకునే సమయంలో మృత్యువు కబలించింది. శుభకార్యానికి వెళ్లి, ఇంటికి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని మింగేసింది. డెత్ స్పాట్‌గా పేరున్న మూల మలుపు వద్ద ఒక్కసారి వాహనం డివైడర్లను రాసుకుంటూ వెళ్లి ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాల పాలై చికిత్స పొందుతూ మరొకరు మృతిచెందారు. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ జాతీయ రహదారి 44 పై చోటు చేసుకుంది.

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ ఎన్‌హెచ్ 44పై ఘోర రోడ్డు‌ప్రమాదం చోటు చేసుకుంది. మదర్సాలో మనువడి విద్యాబ్యాసం ముగిసిన శుభసమయంలో బైంసాలో కుటుంబసభ్యులతో ఆనందంగా వేడుక చేసుకుని ఇంటికి బయలు దేరిన జాహేద్ కుటుంబం మరో 15 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటామని అనుకుంటుండగా వేగం రూపంలో  మృత్యువు దూసుకొచ్చింది. కుటుంబానికి కుటుంబాన్నే మింగేసింది.

ఆదిలాబాద్ జిల్లా టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్న ఇచ్చోడ మండల కేంద్రంలోని బార్కత్ పూర కాలనీకి చెందిన జహేద్ కుటుంబం ఈ రోడ్డు ప్రమాదంలో బలైంది. బైంసా నుంచి తిరిగి ఆదిలాబాద్‌కు‌ వస్తుండగా అర్థరాత్రి 11:30 సమయంలో గుడిహత్నూర్ మండలం సీత గొంది మేకలగండి వద్ద 44వ జాతీయ రహదారిపై వారు ప్రయాణిస్తున్న డీ మాక్స్ వాహనం అదుపుతప్పి సైడ్ పిల్లర్‌ను ఢీకొట్టి అంతే వేగంతో పల్టీలో కొట్టి పక్కనే ఉన్న కొండను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న 8 మందిలో మోహిజుద్దిన్ ( 60 ) , మోహినుద్దిన్ ( 40 ) , అలీ ( 8 ) , హుస్మానుద్దిన్ ( 10 ) అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రగాయాల పాలైన ఫారీద్ ( 12) , అయేషా ( 37 ) , ఇక్వార్ ( 6 ) షాద్ ( 8 ) లను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో తండ్రి, ఇద్దరు కుమారులు మృతి చెందిన దృశ్యాలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించాయి. జహేద్ గతంలో హైదరాబాద్‌లో ఉంటూ, రిలయన్స్ కంపెనీలో ఇంజనీరుగా విధులు నిర్వహించారు. కరోనా లాక్‌డౌన్ అనంతరం బతుకుదెరువు కోసం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చి ఎలక్ట్రిక్ షాప్ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు.

డెత్ స్పాట్‌గా ఉన్న మేకలగండి వద్ద గతంలో పలు ప్రమాదాలు చోటు చేసుకోగా గత ఏడాది ఆదిలాబాద్‌కు చెందిన ఓ కుటుంబం కూడా ఇదే మూలమలుపు వద్ద బలైంది. తాజాగా డెత్ స్పాట్ వద్ద ఆదిలాబాద్‌కు చెందిన జాహెద్ కుటుంబం సైతం ఐదుగురిని కోల్పోయింది.

మొదటిసారి కెమెరా ముందు అంజనా దేవి.! పవన్ ని చూస్తే బాధేసింది అంటూ
మొదటిసారి కెమెరా ముందు అంజనా దేవి.! పవన్ ని చూస్తే బాధేసింది అంటూ
డైరెక్టరే నా చెంపపై కొట్టాడు.. కానీ ఆ న్యూస్‌తో అంతా రివర్స్.!
డైరెక్టరే నా చెంపపై కొట్టాడు.. కానీ ఆ న్యూస్‌తో అంతా రివర్స్.!
ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!
ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!
ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.
ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.
విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?
విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?
గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?
గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?
పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.
పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.
అమ్మో.. లక్ష్మక్క చితక్కొట్టిందిగా.! అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్.
అమ్మో.. లక్ష్మక్క చితక్కొట్టిందిగా.! అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్.
టీజర్ అప్ డేట్ వచ్చిందహో..| కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్
టీజర్ అప్ డేట్ వచ్చిందహో..| కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్
కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుల ఆగ్రహజ్వాలలు.! వీడియో
కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుల ఆగ్రహజ్వాలలు.! వీడియో