Fire Accident: జోగుళాంబ గద్వాల జిల్లా లో దారుణ ఘటన జరిగింది. ఓ పేద రైతు కష్టం అగ్ని పాలైంది. సుమారు లక్ష రూపాయలు నిప్పంటుకుని కాలిపోయాయి. దీంతో పేద కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. కష్టపడి సంపాదించిన డబ్బును బ్యాంక్ నుంచి అంతకు ముందే తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టినల్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే..
కేటీ దొడ్డి మండలం నందిన్నెకు చెందిన రైతు వీరేష్ తనపొలంలో వరి పంటను సాగు చేశాడు. పంట చేతికి రావడంతో.. ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించాడు. దీనికి సంబంధించి ఈ నెల 1న బ్యాంకు ఖాతాలో రూ.లక్ష జమయ్యాయి. శనివారం డబ్బు లు బ్యాంక్ నుంచి తీసుకుని చేతి సంచిలో పెట్టి.. చుట్ట చుట్టి.. ఇంట్లో భద్రపరిచాడు.
సోమవారం ఉదయం ఎప్పటిలా దేవుడి పటాల ముందు పూజ చేసి హారతి ఇచ్చాడు. అయితే కొంత సేపటికి ఆ గుడిసెలోకి వచ్చిన ఓ పిల్లి.. ఇంట్లో తిరుగుతూ.. దేవుడికి ఇచ్చిన హారతి తగిలింది. ఆ హారతి తగలడంతో.. గుడిసెకు మంటలు వ్యాపించాయి.
దీంతో వీరేష్ తో పాటు ఇరుగుపొరుగు ఆ మంటలను ఆర్పేశారు. అప్పటికే రైతు దాచుకున్న లక్ష రూపాయలకు నిప్పు అంటుకుని దగ్ధం అయ్యాయి. దీంతో వీరేష్ కన్నీరు పెట్టుకున్నాడు.. పంట సాగు కోసం తీసుకుని వచ్చిన అప్పు రూ. 50 వేలను తీరుద్దామని అనుకున్నాను.. ఇంతలోనే ఈ ఘోరం జరిగింది అంటూ విలపించాడు. తనను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు. గ్రామస్థులు ఈ నోట్లకు ఆర్బీఐ ఏమైనా రీప్లేస్ చేసేవీలుంటే బాగుండును అని అంటున్నారు.
Also Read: ఘనంగా జరిగిన నటి శరణ్య పెద్దకూతురు ప్రియదర్శిని రిసెప్షన్ వేడుక .. హాజరైన సీఎం స్టాలిన్ దంపతులు