తెలంగాణలో పాగా వేయాలనుకున్నటున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల ఎంపికపై ఆచి తూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే మూడు లిస్టులను విడుదల చేసింది. 119 నియోజకవర్గాలకు గాను 88 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 31 నియోజకవర్గాలకు సంబంధించిన జాబితాను త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది.
తెలంగాణలో ఎన్నికల రాజకీయం వేగంగా మారుతోంది. కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. బీజేపీ – జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. కానీ, సీట్ల పైన చర్చలు మాత్ర ఖరారు కాలేదు. జనసేన అడుగుతున్న సీట్లు ఇచ్చేందుకు బీజేపీ సిద్దంగా లేదు. జనసేన బీజేపీ పొత్తుల అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది గతంలో 32 సీట్లు జనసేన పోటీ చేస్తామని ప్రకటించింది. అయితే పొత్తుల అంశం తెరపైకి వొచ్చిన తరువాత బీజేపీలో సీట్ల పంచాయితీ మొదలయింది. కనీసం 12సీట్లు అయినా ఇవ్వాలని జనసేన పట్టుబడుతూ వచ్చింది.
మరోవైపు తెలంగాణలో బీజేపీ జనసేన పొత్తు దాదాపు ఖరారు అయినట్లు సమాచారం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జనసేన పవన్ కళ్యాణ్‌తో భేటీ జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు దాదాపు 2గంటల పాటు చర్చలు సాగాయి. భేటీ ముగిసిన తరువాత నాయకుల చేసిన వ్యాఖ్యలు బట్టి పొత్తు దాదాపు కొలిక్కివచ్చినట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా జనసేనకు 8 లేదా 9 సీట్లు ఇచ్చే విషయాన్ని బీజేపీ పరిశీలిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ లో రెండు స్థానాలు, ఖమ్మంలో నాలుగు సీట్లు జనసేనకు ఇవ్వడానికి బీజేపీ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా జనసేనకు ఇచ్చే అవకాశం ఉన్న సీట్లలో కూకట్‌పల్లి, వైరా, ఖమ్మం, అశ్వారావుపేట, కొత్తగూడెం, కోదాడ, నాగర్‌కర్నూల్, తాండూరు ఉన్నాయి. కూకట్‌పల్లితో పాటు గ్రేటర్‌లో మరో సీటు జనసేనకు ఇచ్చే ఛాన్స్ కూడా ఉందని చెబుతున్నారు. రెండు సీట్ల కి సంబంధించిన దానిపైన చర్చలు కొనసాగుతున్నట్లు తెలిసింది.
శేరి లింగంపల్లి నియోజవకర్గంపైన ఇరు పార్టీల మధ్య సయోధ్య కుదరడం లేదు. శేరిలింగంపల్లి విషయంలో సీనియర్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎట్టి పరిస్థితిలో జనసేనకి కేటాయించవద్దని పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈమేరకు ఢిల్లీ పెద్దలతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే జనసేనకి కేటాయించాలనుకుంటున్న సీట్లని మినహాయించి మిగిలిన 22సీట్లకి ప్రకటించాలని చూస్తోంది బీజేపీ. సోమవారం ఢిల్లీలో జరుగనున్న బీజేపీ సెంట్రల్ ఎలక్షణ్ కమిటీ సమావేశానికి కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ మీటింగ్‌లో తెలంగాణలో పోటీ చేసే అభ్యర్థులపై కసరత్తు కొలిక్కి రానుంది. అనంతరం బీజేపీ తన 4వ జాబితాకు సంబంధించి 22మందితో రిలీజ్ చేసే అవకాశం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..