కొంపముంచిన గూగుల్ మ్యాప్.. ఫాలో అవుతూ 15 కి.మీ. అడవిలోకి ప్రయాణం.. చివరికి..!

| Edited By: Balaraju Goud

Aug 31, 2024 | 4:26 PM

కొత్త ప్లేస్‌కి వెళ్లాలంటే గూగుల్‌ మ్యాపే దిక్కు. అందుకే, గూగుల్ మ్యాప్.. ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. డెలివరీ సర్వీసుల నుంచి అనేక అవసరాలకు ఈ రూట్‌ మ్యాప్పే ఉపయోగపడుతోంది. రోజూ కోట్లాది మంది ఈ గూగుల్‌ రూట్‌ మ్యాప్‌ను వాడుతూ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.

కొంపముంచిన గూగుల్ మ్యాప్.. ఫాలో అవుతూ 15 కి.మీ. అడవిలోకి ప్రయాణం.. చివరికి..!
Lorry Struck In Forest
Follow us on

కొత్త ప్లేస్‌కి వెళ్లాలంటే గూగుల్‌ మ్యాపే దిక్కు. అందుకే, గూగుల్ మ్యాప్.. ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. డెలివరీ సర్వీసుల నుంచి అనేక అవసరాలకు ఈ రూట్‌ మ్యాప్పే ఉపయోగపడుతోంది. రోజూ కోట్లాది మంది ఈ గూగుల్‌ రూట్‌ మ్యాప్‌ను వాడుతూ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. అయితే, ఒక్కోసారి తప్పుదారి పట్టిస్తూ తిప్పలు పెడుతోంది ఈ రూట్‌మ్యాప్‌. అలాంటి ఇన్సిడెంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది.

గూగుల్ మ్యాప్ ను నమ్ముకొని అడవిలో చిక్కుకుంది ఓ లారీ. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ నుంచి ఎరువుల బస్తాలతో ములుగు జిల్లా రాజ్‌పేట‌కు బయలుదేరింది ఒక లారీ. కొత్తగూడెం మీదుగా మణుగూరు రూట్ నుంచి రాజ్ పేట‌కు చేరుకోవాల్సి ఉంది. కరకగూడెం మండలం రేగల్ల నుంచి గూగుల్ మ్యాప్‌లో తక్కువ కిలో మీటర్ల దూరం చూపించడంతో.. డ్రైవర్ ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. రేగల్ల.. మర్కోడు మధ్య వాగులు, గుట్టల బాటలో 14 కిలో మీటర్లు అడవి మార్గంలోకి ప్రవేశించింది. ఈ క్రమంలోనే వచ్చిన లారీ బురదలో ఇరుక్కుపోయింది. దీంతో అటుగా వాహనాల రాకపోకలు పెద్దగా కనిపించకపోవడంతో దారి తప్పినట్లు గుర్తించాడు డ్రైవర్. చివరికి స్థానికుల సాయంతో బయటపడ్డారు.

దారి తెలియక గూగుల్‌మ్యాప్‌ను నమ్ముకుంటే కొన్నిసార్లు కొంపముంచుతుందనడానికి ఈ ఇన్సిడెంటే రుజువు. గూగుల్‌ మ్యాప్‌ను నమ్ముకొని కారడవిలో చిక్కుకుపోయాడు లారీ డ్రైవర్‌. ఏపీలోని కాకినాడ నుంచి ఎరువుల లోడ్‌తో ములుగు జిల్లా రాజ్‌పేట బయల్దేరిన లారీ డ్రైవర్‌.. గూగుల్‌ మ్యాప్‌ను ఫాలో అవుతూ ఇరుక్కుపోయాడు. కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రేగల్ల-మర్కోడు మధ్య 14 కిలోమీటర్ల మేర అడవిలో ప్రయాణిస్తూ అష్టకష్టాలు పడ్డాడు లారీ డ్రైవర్‌. చివరికి, జేసీబీ సాయంతో లారీని 5కిలోమీటర్ల మేర వెనక్కి లాక్కుని రావాల్సి వచ్చింది.

వీడియో చూడండి..

 

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..