బైక్‌పై వెళ్తుండగానే ఆగిన గుండె.. కూతురు కళ్ళెదుటే తండ్రి దుర్మరణం.. !

ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన అందరిని కలచివేసింది. అప్పటి వరకు కళ్లముందే తిరుగుతూ, సరదాగా కబుర్లు చెప్పిన తండ్రి.. నిమిషాల వ్యవధిలోనే విగతజీవిగా మారడం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. కూతురు కళ్లెదుటే తండ్రి గుండెపోటుతో బైక్‌పై నుంచి కుప్పకూలి ప్రాణాలు విడిచిన హృదయవిదారక ఘటన ఖమ్మం-కోదాడ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.

బైక్‌పై వెళ్తుండగానే ఆగిన గుండె.. కూతురు కళ్ళెదుటే తండ్రి దుర్మరణం.. !
Man Collapses From Bike

Edited By:

Updated on: May 07, 2026 | 4:19 PM

ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన అందరిని కలచివేసింది. అప్పటి వరకు కళ్లముందే తిరుగుతూ, సరదాగా కబుర్లు చెప్పిన తండ్రి.. నిమిషాల వ్యవధిలోనే విగతజీవిగా మారడం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. కూతురు కళ్లెదుటే తండ్రి గుండెపోటుతో బైక్‌పై నుంచి కుప్పకూలి ప్రాణాలు విడిచిన హృదయవిదారక ఘటన ఖమ్మం-కోదాడ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.

నేలకొండపల్లికి చెందిన అంజి తన కుమార్తె సరితతో కలిసి బైక్‌పై ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి బయలుదేరారు. ఇంట్లో ఉన్నంతసేపు తండ్రీకూతుళ్లు ఎంతో సంతోషంగా గడిపారు. అయితే, వారి ప్రయాణం గోకినేపల్లి సమీపానికి చేరుకోగానే అంజికి ఒక్కసారిగా తీవ్రమైన గుండెపోటు వచ్చింది. బైక్‌పై నియంత్రణ కోల్పోవడంతో ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. ఈ ప్రమాదంలో వెనుక కూర్చున్న సరిత తలకు బలమైన గాయమైంది.

స్థానికులు వెంటనే స్పందించి నేషనల్ హైవే అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంజిని చికిత్స నిమిత్తం ముదిగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. కళ్లెదుటే తండ్రి మరణించడంతో సరిత కన్నీరుమున్నీరుగా విలపించడం చూసి అక్కడి వారు చలించిపోయారు.

మృతుడి సోదరుడు బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముదిగొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంజి అకాల మరణంతో నేలకొండపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా గుండెపోటుకు గురై మరణించడం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us