Horrible Murders: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం.. తండ్రి సహా ఇద్దరు కొడుకులను అత్యంత కిరాతకంగా..

|

Jun 19, 2021 | 3:54 PM

Horrible Murders: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భూ తగాదాల నేపథ్యంలో ఒకే కుటుంబానికి ముగ్గురు వ్యక్తుల...

Horrible Murders: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం.. తండ్రి సహా ఇద్దరు కొడుకులను అత్యంత కిరాతకంగా..
Murder
Follow us on

Horrible Murders: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భూ తగాదాల నేపథ్యంలో ఒకే కుటుంబానికి ముగ్గురు వ్యక్తులను అత్యంత దారుణంగా హత్య చేశారు దుండగులు. తండ్రితో పాటు ఇద్దరు కొడుకులను పంటచేను లోనే ప్రత్యర్థులు చంపేశారు. ఈ ఘటన కాటారం మండలంలోని గంగారం గ్రామంలో ఈ దారుణ హత్యలు చేసుకున్నారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ నేపథ్యంలో గొడ్డళ్లతో దాడి చేసి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని మట్టుబెట్టారు దుండగులు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గంగారం గ్రామంలో సర్వే నెంబర్ 365 నెంబర్‌లో 20 ఎకరాల భూమి విషయంలో గత పదేళ్ల నుంచి మంజునాయక్ కుటుంబం, అతని తమ్ముడి కుటుంబం మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ భూ వివాదం కోర్టు పరిధిలో కొనసాగుతుంది.

అయితే, 365 సర్వేనెంబర్ గల భూమి పట్టా మంజునాయక్ పేరిట ఉండడంతో.. అతను తన కొడుకులు సారయ్య, భాస్కర్‌తో కలిసి దుక్కి దున్నుతున్నారు. అది చూసిన మంజునాయక్ తమ్ముడు.. తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో ఘర్షణ తీవ్రమవగా.. మంజునాయక్‌తో పాటు అతని కొడుకులపై కర్రలు, గొడ్డళ్లతో మూకుమ్మడిగా దాడి చేసి మట్టుబెట్టారు. హత్య అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

Also read:

TS Cabinet Meeting Live: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం.. రాష్ట్రంలో లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేత..