Viral: పెళ్లిచూపులకు ఖాకీ డ్రెస్‌లో దర్శనమిచ్చిన యువతి.. కట్ చేస్తే.. వెలుగులోకి షాకింగ్ నిజం.!

| Edited By: Ravi Kiran

Mar 20, 2024 | 1:08 PM

నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన ఒక అమ్మాయిని పోలీసులు అరెస్టు చేశారు. రైల్వే ఎస్ఐనని చెప్పుకుంటూ చెలామణి అవుతున్న మాళవిక అనే యువతి బండారాన్ని బట్టబయలు చేశారు రైల్వే పోలీసులు. నార్కెట్‌పల్లికి చెందిన మాళవిక నిజాం కాలేజ్‌లో డిగ్రీ పూర్తి చేసింది.

Viral: పెళ్లిచూపులకు ఖాకీ డ్రెస్‌లో దర్శనమిచ్చిన యువతి.. కట్ చేస్తే.. వెలుగులోకి షాకింగ్ నిజం.!
Fake Si
Follow us on

నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన ఒక అమ్మాయిని పోలీసులు అరెస్టు చేశారు. రైల్వే ఎస్ఐనని చెప్పుకుంటూ చెలామణి అవుతున్న మాళవిక అనే యువతి బండారాన్ని బట్టబయలు చేశారు రైల్వే పోలీసులు. నార్కెట్‌పల్లికి చెందిన మాళవిక నిజాం కాలేజ్‌లో డిగ్రీ పూర్తి చేసింది. 2018లో ఆర్పిఎఫ్ ఎస్సై పరీక్ష రాసింది. అయితే పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చినా.. కంటి సమస్య ఉండటంతో వైద్య పరీక్షల్లో ఆమె డిస్‌క్వాలిఫై అయింది. ఎలాగైనా సరే రైల్వేలో పోలీసు కావాలనుకున్న మాళవిక ఖాకీ యూనిఫామ్‌ను ధరించింది. నార్కెట్‌పల్లి గ్రామంలో ఆర్పిఎఫ్ ఎస్ఐగా చలామణి అవుతూ వచ్చింది. తను శంకరపల్లి ఆర్పీఎఫ్‌లో విధులు నిర్వహిస్తున్నట్లు అందరిని నమ్మించింది. యూనిఫాంలో ఉన్న ఫోటోలను తన ప్రొఫైల్ పిక్చర్లుగా, స్టేటస్‌ల్లో పెట్టుకోవడంతో ఆమెకు తెలిసిన వారు చాలామంది నిజంగానే ఉద్యోగం వచ్చిందని నమ్మారు. అయితే తనకు ఒక పెళ్లి సంబంధం రాగా.. అబ్బాయిని చూసేందుకు సైతం యూనిఫాంలోనే వెళ్లింది మాళవిక. ఇక్కడే అసలు తంతు బయటపడింది.

పెళ్లి చూపులకు సైతం యూనిఫాంలో రావటంతో ఒకసారిగా అబ్బాయి తరపువాళ్లు ఖంగుతిన్నారు. మాళవిక వైఖరి ఆ నోటా ఈ నోటా పడటంతో తమకు తెలిసిన రైల్వే అధికారుల ద్వారా ఎంక్వయిరీ చేయించుకున్నారు అబ్బాయి తరపు బంధువులు. అసలు మాళవిక అనే రైల్వే ఎస్సై లేనే లేదని నిర్ధారణకు వచ్చారు. దీంతో పోలీసులను ఆశ్రయించి అసలు విషయం తెలిపారు. నల్గొండలో మాళవికను అదుపులోకి తీసుకున్నారు రైల్వే పోలీసులు. అయితే పోలీసుల ప్రశ్నలకు తాను ఎస్ఐ కాలేనన్న బాధతో తల్లిదండ్రులు ఉన్నారని, అందుకోసమే నకిలీ ఎస్ఐగా అవతారం ఎత్తానని పోలీసులకు చెప్పుకొచ్చింది మాళవిక. అటు రైల్వే ఎస్ఐగా ఇన్‌స్టాగ్రామ్‌లో మాళవిక చేసిన రీల్స్ విపరీతంగా వైరల్ అయ్యాయి. గత ఏడాదికాలం నుంచి మాళవిక ఇదే రీతిలో నకిలీ ఎస్ఐగా చలామణి అవుతున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. మాళవికను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

ఇది చదవండి: కందిచేనులో గుప్పుమన్న ఘాటైన వాసన.. లోపలకెళ్లి చూడగా ఆశ్చర్యపోయిన రైతులు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం