Fake Currency: ఫేక్‌ కరెన్సీ కేటుగాళ్లు.. దొంగనోట్ల ముఠా కలకలం.. ఐదుగురు అరెస్టు..!

|

Jun 06, 2022 | 5:12 AM

Fake Currency: దొంగనోట్ల ముఠా కలకలం రేపింది. అప్పుడే ప్రింట్‌ తీసినట్టుగా ఉన్న నోట్లు చూస్తే ఎవరైనా అవి ఫేక్‌ కరెన్సీ అని నమ్మలేరు. ఈ కేసులో..

Fake Currency: ఫేక్‌ కరెన్సీ కేటుగాళ్లు.. దొంగనోట్ల ముఠా కలకలం.. ఐదుగురు అరెస్టు..!
Follow us on

Fake Currency: దొంగనోట్ల ముఠా కలకలం రేపింది. అప్పుడే ప్రింట్‌ తీసినట్టుగా ఉన్న నోట్లు చూస్తే ఎవరైనా అవి ఫేక్‌ కరెన్సీ అని నమ్మలేరు. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్‌ దగ్గర కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్టు సమాచారం రావడంతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. బస్టాండ్‌లో ఉన్న వారి దగ్గర ఉన్న బ్యాగులు తనిఖీ చేయగా వారి అనుమానం నిజమైంది. వారి బ్యాగుల్లో ఫేక్‌ కరెన్సీ నోట్లు బయట పడ్డాయి. మొత్తం 500 నోట్లతో ఉన్న నకిలీ కరెన్సీ. 15 లక్షల నకిలీ కరెన్సీని పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్‌ చేశారు జగిత్యాల పోలీసులు.

ఈ కేసులో ప్రధాన సూత్రధారి దండేపల్లి గ్రామానికి చెందిన శేఖర్‌గా గుర్తించారు పోలీసులు. 2004 నుంచే శేఖర్‌ అనే నిందితుడు గుప్తనిధుల వేట పేరుతో మోసాలకు పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు.

ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతోనే శేఖర్‌, అతడి గ్యాంగ్‌ ఫేక్‌ కరెన్సీని చెలామణి చేస్తోందని పోలీసులు తెలిపారు. లక్ష రూపాయల ఒరిజినల్‌ నోట్లకు, 5 లక్షల ఫేక్‌ కరెన్సీని ఇచ్చి వాటిని మార్పిడి చేయాలని ఈ ముఠా ప్రయత్నించిందని జగిత్యాల పోలీసులు తెలిపారు. నిందితుల దగ్గరి నుంచి 15 లక్షల ఫేక్‌ కరెన్సీతో పాట 3 లక్షల ఒరిజినల్‌ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి