Fake Certificates: యూనివర్సిటీ ఎక్కడైనా, డిగ్రీ ఏదైనా.. ఐదే ఐదు నిమిషాల్లో సర్టిఫికెట్‌లు ఇస్తారక్కడ. రెగ్యులర్ డిగ్రీకి ఒకరేటు, బీటెక్ అయితే ఇంకో రేటు, మెడిసిన్ అయితే మరో రేటు. రండి బాబు రండీ.. అంటారంతే. తెలంగాణలో ఎడ్యుకేషన్ సర్టిఫికేట్‌లను అంగట్లో సరుకుల్లా అమ్మేస్తున్నారు ఫేక్‌గాళ్లు. ఆ కిలాడీ ముఠాలను పట్టుకున్నారు పోలీసులు. దేశంలో గుర్తింపు పలు వర్సిటీల పేరిట నకిలీ సర్టిఫికెట్లను తయారుచేసి, వాటి ద్వారా విద్యార్థులను విదేశాలకు తరలిస్తున్నారు అక్రమార్కులు. ఈ ముఠాల సభ్యులను అరెస్టు చేశారు పోలీసులు. వారి నుంచి నకిలీ సర్టిఫికెట్లు, ల్యాప్‌టాప్‌లు, ఐపాడ్‌లు, ప్రింటర్లు, రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఒక్కో సర్టిఫికెట్‌కు మూడు లక్షల నుంచి 30 లక్షల వరకు వసూలు చేస్తోంది వరంగల్ ముఠా.
పాలిటెక్నిక్ మొదలు, డిగ్రీ, పీ.జీ, ఎంబీబీస్, ఇంజినీరింగ్ ఇలా ఏ సర్టిఫికేట్ అయినా, ఏ యూనివర్సిటీ అయినా, ఐదే ఐదు నిమిషాల్లోనే ముద్రించి ఇచ్చేస్తోంది ఈ ఫేక్ ముఠా. కన్సల్టెన్సీల ద్వారా ఆ నకిలీ సర్టిఫికేట్స్‌తో యువతను ఈజీగా విదేశాలకు తరలించేస్తోంది. వరంగల్ కేంద్రంగా జరుగుతున్న ఈ హైటెక్ దందాను పసిగట్టారు పోలీసులు. దార అరుణ్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు. ఇక హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో కన్సల్టెన్సీ ఆఫీస్ పెట్టి, అక్కడి నుంచి దేశంలోని ఏ యూనివర్సిటీ ఐనా, ఏ కోర్స్ సర్టిఫికెట్ కావాలన్నా ఇక్కడే తయారు చేస్తున్నారు. అనవసరంగా ఏళ్ళ తరబడి చదవాల్సిన అవసరం లేకుండానే ..డబ్బు విసిరేస్తే అన్ని సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు. వారినీ అరెస్టు చేశారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు.
వరంగల్ కేసులో మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితులు హైదరాబాద్‌కు చెందినవారిగా తేల్చారు. ఇక బషీర్‌బాగ్ దందాకు అసలు సూత్రధారి యాకుత్‌పురకు చెందిన సయ్యద్ నవీద్‌గా గుర్తించారు పోలీసులు.
Also read:
83 Movie: 6 నెలలు.. రోజుకు 4 గంటలు.. కపిల్ దేవ్‌లా రణవీర్ సింగ్ ఎలా మారాడంటే?
US: ఆ ఉగ్రవాద దాడిపై సమాచారమిస్తే 5 మిలియన్ల డాలర్ల రివార్డ్.. ప్రకటించింది ఎవరో తెలుసా..?