Telangana Night Curfew: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నైట్‌ కర్ఫ్యూ పొడిగిస్తూ ఉత్తర్వులు.. ఎప్పటి వరకు అంటే..

|

Apr 30, 2021 | 2:58 PM

Telangana Night Curfew: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. ప్రతి రోజు మరణాలు తక్కువగా ఉన్నా.. పాజిటివ్‌ కేసులు మాత్రం తీవ్ర స్థాయిలో..

Telangana Night Curfew: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నైట్‌ కర్ఫ్యూ పొడిగిస్తూ ఉత్తర్వులు.. ఎప్పటి వరకు అంటే..
Follow us on

Telangana Night Curfew: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. ప్రతి రోజు మరణాలు తక్కువగా ఉన్నా.. పాజిటివ్‌ కేసులు మాత్రం తీవ్ర స్థాయిలో నమోదవుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక రాష్ట్రంలో శుక్రవారంతో రాత్రి పూట కర్ఫ్యూ ముగియనుంది. కరోనా కేసులు, మరణాలు పెరుగుతుండటంపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు విధిస్తున్న నైట్‌ కర్ఫ్యూను మే 8వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే వాస్తవానికి ఈ రోజు కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష జరపాల్సి ఉంది. సీఎస్‌తో పాటు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ, హోంశాఖ అధికారులతో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాల్సి ఉంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటారని.. అవసరమైతే వారం రోజులు మినీ లాక్‌డౌన్ విధిస్తారని ప్రచారం జరిగింది. కానీ అంతలోనే కోర్టులో విచారణ జరగడం.. వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆదేశించడంతో.. కేవలం నైట్‌ కర్ఫ్యూని పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే తెలంగాణలో లాక్‌డౌన్ ఉండదని ఇప్పటికే ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ప్రస్తుతం ఉన్న నిబంధనలే మే 8 వరకు అమల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. రాత్రి 9 తర్వాత ఎవరూ బయట తిరిగిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. అయితే అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.

మరో వైపు రాష్ట్రంలో కొత్తగా 7,646 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 53 మంది మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక కొత్తగా 5,926 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,35,606కు చేరుకుంది. అలాగే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,55,618 మంది కోలుకోగా, ఇప్పటి వరకు 2,261 మంది కరోనా బారిన పడి మృతి చెందారు.

ఇవీ కూడా చదవండి:

lockdown: ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కీలక నిర్ణయం.. లాక్‌డౌన్ గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే..?

Coronavirus: 8 రోజుల శిశువుకు కరోనా పాజిటివ్‌.. కోవిడ్‌ను జయించిన బాలుడు.. హర్షం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు