Khammam Drugs: ఖమ్మం టు హైదరాబాద్.. డ్రగ్స్ దందా గుట్టురట్టు.. ఇద్దరు అరెస్ట్‌..

|

Jun 24, 2022 | 6:10 AM

ఈ డ్రగ్స్‌, గంజాయిని హైదరాబాద్‌లో అమ్మేందుకు తీసుకొచ్చినట్టు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకరిపై బెంగళూరు, హైదరాబాద్‌లో కేసులు ఉన్నట్టు గుర్తించారు.

Khammam Drugs: ఖమ్మం టు హైదరాబాద్.. డ్రగ్స్ దందా గుట్టురట్టు.. ఇద్దరు అరెస్ట్‌..
Khammam Drugs
Follow us on

Khammam Drugs: డ్రగ్స్‌ అంటే ఒకప్పుడు మెట్రో నగరాలే గుర్తొచ్చేవి. కానీ, ఇప్పుడు ఆ కల్చర్‌ జిల్లాలకు కూడా పాకింది. తాజాగా, ఖమ్మంలో మాదక ద్రవ్యాల కలకలం రేపాయి. ఖమ్మం నగరానికి చెందిన యువకుల నుంచి 10 గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తుమ్మ భానుతేజారెడ్డి, రోహిత్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరి నుంచి 10 గ్రాముల డ్రగ్స్ (ఎండీఎంఏ), 60 గ్రాముల హషీష్ ఆయిల్ (గంజాయితో చేసిన నూనె), 1600 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్‌, గంజాయిని హైదరాబాద్‌లో అమ్మేందుకు తీసుకొచ్చినట్టు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకరిపై బెంగళూరు, హైదరాబాద్‌లో కేసులు ఉన్నట్టు గుర్తించారు. నిందితుల్లో ఒకరికి గతంలో నేర చరిత్ర ఉందని చెప్పారు.

ఖమ్మంలోని శ్రీశ్రీ సర్కిల్‌లో తనిఖీలు నిర్వహిస్తుండగా, కారులో ఇద్దరు యువకుల వద్ద మత్తు పదార్ధాలతో పట్టుబడినట్టు వెల్లడించారు పోలీసులు. ఈ ఇద్దరు యువకులు ఖమ్మం నుంచి కొరియర్‌, ట్రావెల్‌ సర్వీసు ద్వారా హైదరాబాద్‌కు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. డ్రగ్స్ బెంగళూరు, గోవా, ముంబై నుంచి దిగుమతి చేసుకుంటున్నారని.. అలాగే గంజాయిని ఏపీలోని అరకు ప్రాంతం నుంచి దిగుమతి చేసుకుంటున్నారని తెలిపారు.

ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్న క్రమంలో పట్టుబడినట్లు ఖమ్మం పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ జి నాగేంద్రరెడ్డి తెలిపారు.

ఇవి కూడా చదవండి

దీని వెనుక ఎవరిదైనా ప్రమేయం ఉండొచ్చన్న అనుమానంతో విచారణ చేస్తున్నామని తెలిపారు. కాగా.. ఖమ్మంలో డ్రగ్స్ లభించడం కలకలం రేపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..