Samatha Murthy: హైదరాబాద్ శివారు ముచ్చింతల్ (Muchintal)లోని శ్రీరామనగరంలో వెలసిన సమతామూర్తి కేంద్రాన్ని దర్శించాలని భావించే భక్తుల కోసం నిర్వాహకులు సందర్శన వేళలను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేంద్రానికి వారాంతపు సెలవు (Holiday)ను కూడా ప్రకటించారు. ప్రతి బుధవారం సమతామూర్తి కేంద్రానికి సెలవు ఉండనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సందర్శన సమయాన్ని రాత్రి 9 గంటల వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకూ మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే ఉండేది. టికెట్ కౌంటర్లు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటాయని వారు వివరించారు.
ఇక ప్రవేశ రుసుము 6-12 ఏళ్లలోపు పిల్లలకు రూ.75, పెద్దలకు రూ.150గా నిర్ణయించారు. ఐదేళ్లలోపు చిన్నారుల ప్రవేశానికి ఉచితంగా అనుమతి ఇస్తారు. కాగా సమతా మూర్తి కేంద్రానికి ఇటీవల శ్రీరామనగరంగా పేరు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. శ్రీరామనగరంలో 216 అడుగుల ఎత్తయిన రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు.
ఇవి కూడా చదవండి: